బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా దబాంగ్ 3. గతంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ సిరీస్ లోని రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకుని సల్మాన్ భాయ్ కి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ మరియు యాష్ రాజ్ ఫిలిమ్స్ కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్ హీరొయిన్స్ గా నటించగా, ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ విలన్ పాత్రలో నటించారు. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం...


స్టోరీ :

 

కథా పరంగా ఒక సాధారణ కథతో సాగే ఈ సినిమా ప్రథమార్ధం మొత్తం కూడా చాలావరకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో సాగుతుంది. ఆ సీన్స్ సమయంలో యంగ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ తో కలిసి నటించిన సల్మాన్, తన చుల్ బుల్ పాండే క్యారెక్టర్ కోసం కొంత యంగ్ గా కనపడ్డాడు. ముఖ్యంగా మంచి డైలాగ్స్, కామెడీ మరియు రొమాంటిక్ సీన్స్ తో ఆకట్టుకునేలా సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్ చాలావరకు యాక్షన్ మోడ్ లో సాగుతుంది. మధ్యలో వచ్చే రెండు సాంగ్స్, ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయట. విలన్ గా నటించిన సుదీప్ మరియు సల్మాన్ వచ్చే కొన్ని సీన్స్ ఎంతో బాగున్నాయని, ముఖ్యంగా విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెప్తున్నారు. 


ప్లస్ పాయింట్స్ ...!!

 

సినిమా లో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, స్టోరీ అంతా బాగానే ఉంది ,ఇక సల్మాన్ ఖాన్ యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా అదరగొట్టే రీతిలో పెర్ఫర్మ్ చేసాడు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి సినిమాలో సల్మాన్ ఖాన్ నటించిన నటన మరియు డైలాగులు బాగుంటాయి. అవి థియేటర్లో సల్మాన్ అభిమానులను ఈలలు వేసేలా చేస్తాయి. కొన్ని కామెడీ ట్రాకులు కూడా అలరించే రేంజ్ లో డైరెక్టర్ ప్రభుదేవా తీశాడనే చెప్పాలి. హీరోయిన్స్ ఇద్దరి గ్లామర్, యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. చివర్లో వచ్చే బేర్ బాడీ ఫైట్ సీన్ చాలా బాగుంది. 

 

మైనస్ పాయింట్స్...!!

 

సినిమా లో నెగిటివ్:పాయింట్స్ విషయానికి వస్తే, సల్మాన్ క్యారెక్టర్ కు తెలుగు డబ్బింగ్ సరిగ్గా సెట్ కేలేదు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా మన తెలుగు నేటివిటీ కి పెద్దగా సెట్ కాకపోవడంతో, ఇక్కడి సినిమా ప్రేమికులకు చాలావరకు సినిమా నచ్చే అవకాశం లేదు. అలానే సినిమా చూస్తున్నంత సేపు చాలా స్లో గా మరియు బోరింగ్ గా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో  చాలా చోట్ల ల్యాగ్స్ ఉండడం దీనికి మైనస్ గా చెప్పవచ్చు. 
 
విశ్లేషణ :

 

మొత్తంగా చెప్పాలంటే దబాంగ్ సిరీస్ లో వచ్చిన గత రెండు సినిమాల మాదిరిగా దబాంగ్ 3 కూడా బాగానే తెరకెక్కినప్పటికీ, ఈ సినిమా తెలుగులో మాత్రం పెద్దగా సక్సెస్ అయ్యే దాఖలాలు మాత్రం కనపడడం లేదు. ముఖ్యంగా సల్మాన్ చెప్పే భారీ డైలాగులు హిందీ ప్రేక్షకులకు నచ్చుతాయేమో కానీ, తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కకపోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ చాలా వరకు సాగతీత గా ఉండడం, అలానే పూర్తిగా యాక్షన్ మోడ్ లో సినిమా సాగడం కూడా ఆడియన్స్ సహనానికి కొంత పరీక్ష పెడుతుంది. కాగా సల్మాన్ చేసే ఫైట్స్, సాంగ్స్, ఛేజింగ్ సీన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ఓవర్ ఆల్ గా హిందీలో సక్సెస్ టాక్ సంపాదించిన ఈ సినిమా, తెలుగులో మాత్రం ఆ రేంజ్ లో ముందు సాగే అవకాశాలు తక్కువ అని అంటున్నారు. అదీకాక ప్రస్తుతం ఇదే రోజున  మరొక మూడు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవడంతో, అవి ఒకింత ఈ సినిమా కలెక్షన్స్ కు గండి కొట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: