జై సింహా' తర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 105వ చిత్రం 'రూలర్‌'. ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటించారు. రైతు సమస్యలపై చిత్రం అని ముందుగానే వార్త రావడంతో ఎలా వుంటుందనే ఆసక్తిమటుకు కల్గించింది. శుక్రవారమే విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాకు డివైడ్ టాక్ వస్తుంది.

 

బాలయ్య సినిమా అంటే యాక్షన్ మాత్రమే ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. బాలయ్య కూడా అది దాటి సినిమాలు చేయడం లేదు. దాంతో సినిమా లవర్స్ లో కొంత నిరాశ కనిపిస్తుంది.  సాధారణంగా  ప్రేక్షకులు సినిమా అంటే నవరసాలను కోరుకుంటారు. బాలయ్య సినిమాలో అన్ని ఉంటాయి కానీ రొమాన్స్ మాత్రం కరువే.. యువతను, రసిక ప్రియులను ఆకట్టుకోవడానికి సినిమాలో గ్లామరస్ భామలను తీసుకున్నప్పటికీ రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం సినిమాలో ఉండవు. బాలయ్య కు యంగ్ బ్యూటీలు దొరకడమే కష్టం..  దొరికిన వారితో రొమాన్స్ పెడితే సినిమాకు సెట్ అవ్వదేమో నాని దర్శకులు భయపడుతున్నారు .  

 

దాంతో రొమాన్స్ కోరుకునే వారికీ మాత్రం బాలయ్య సినిమా భారమే అవుతుంది. అసలే ట్రెండ్ మారింది. సినిమాల్లో లిప్ లాకులు , బెడ్ రూమ్ సీన్లు, బూతు డైలాగులు  చాలా కామన్ అయిపోయాయి. ఓ వైపు కుర్రహీరోలంతా కుమ్మేస్తున్నారు. మరో వైపు సీనియర్ హీరోలు కూడా ఛాన్స్ దొరికితే తమ స్టైల్లో రొమాన్స్ తో రెచ్చిపోతున్నారు. కానీ బాలయ్య మాత్రం ఫైట్లు , డాన్స్ లకే పరిమితమైపోయాడు. సెక్సి భామలను సినిమాలో పెట్టుకొని కూడా రొమాన్స్ లేకపోతే ఆడియన్స్ ఎలా వస్తారు చెప్పండి. ఇంకా బాలయ్య ఆదిత్య 369 కాలం లోనే ఉంటే ఎలా..? అసలే ఇది అర్జున్ రెడ్డి జనరేషన్ . రొమాన్స్ లేకపోతే ఆడియన్స్ సినిమాకు రావడం కష్టమే అని ఇప్పటికైనా బాలయ్యకు అర్ధమయ్యే ఉంటుంది. మరి బోయపాటి సినిమాలో ఇప్పటికే హాట్ బ్యూటీ కేథరిన్ ను తీసుకున్నారు మరి ఈ అమ్మడితో నైనా బాలయ్య రొమాన్స్ చేస్తాడో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: