తెలుగు ఇండస్ట్రీ లో ప్రభాస్ పేరు మారుమోగాల్సిందే.. బాహుబలి అంత గొప్ప చిత్రములో నటించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు.. అలాంటి ప్రభాస్ పెళ్లి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు... ఎక్కడ ఏ పార్టీ అయిన, ఫంక్షన్ అయిన గాని ప్రభాస్ ని అడిగే ప్రశ్న పెళ్లి ఇప్పుడు? అని.. ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో మొదటి స్థానంలో ప్రభాస్ ఉన్నారు. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. .

 

ఎన్ని సార్లు అడిగిన దానికి ఆయ‌న మాత్రం స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకుంటూనే ఉంటాడు. తాజాగా పెళ్ళికి సంబందించిన విషయం ఒకటి బయటికి వచ్చింది. మూడేళ్ల కింద పెళ్లి అంటే బాహుబ‌లి అన్నాడు.. ఆ త‌ర్వాత అడిగితే అది పూర్త‌య్యాక అన్నాడు.. తర్వాత సాహో అన్నాడు. ఇప్పుడు అది కూడా విడుదలై చాలా రోజులవుతుంది. ప్రస్తుతం ఈయన రాధాకృష్ణ కుమార్ సినిమా చేస్తున్నాడు. దానికి తోడు అప్పుడే ప్ర‌భాస్ వ‌య‌సు కూడా 40కి వ‌చ్చేసింది.

 

అయినా కూడా పెళ్లి వైపు చూడ‌టం లేదు ఈ హీరో. తాజాగా ఈయన పెళ్లిపై సంచలన వార్తలు బయటికి వస్తున్నాయి. డిసెంబర్ 31న ప్రభాస్గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.... ఇక ప్రభాస్అమెరికా అమ్మాయితో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. అక్కడే స్థిరపడిన ఓ వ్యాపార వేత్త కూతురుతో ఈ హీరో పెళ్లి జరగనుందనే వార్తలు కొన్ని రోజులు నుంచి వస్తున్నాయి...

 

కాని ప్రభాస్ గాని కుటుంబ సభ్యులు కాని ఇలాంటి రూమర్స్ పై ఇలాంటి కామెంట్ చెయ్యరు... ఆ మధ్య ప్రభాస్ పెద్ద‌మ్మ, కృష్ణంరాజు భార్య శ్యామ‌లా దేవి కూడా పెళ్లిపై వ‌చ్చే వార్త‌ల‌ను తాము స‌ర‌దాగా తీసుకుంటామ‌ని చెప్పింది. అది చూసి న‌వ్వుకోవ‌డం కూడా అల‌వాటు చేసుకున్నామ‌ని చెప్పారు కృష్ణంరాజు స‌తీమ‌ణి. అయితే ఆ తర్వాత ప్ర‌భాస్ పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది..

 

ప్ర‌స్తుతం న‌టిస్తున్న రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన‌ట్లు అప్పట్లో చెప్పింది .. మాది చాలా పెద్ద కుటుంబం అని, అందరితో చక్కగా, కలివిడిగా కలిసిపోయే అమ్మయి అయితే బాగుంటుంది అని ప్రభాస్ పెద్దమ్మ ఒపీనియన్... ఏది ఏమయినా నెక్స్ట్ ఇయర్ లో అన్నా ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కుతారేమో చూడాలి.....




మరింత సమాచారం తెలుసుకోండి: