స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో ఇప్పటికే దాదాపుగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా నుండి ఇటీవల మూడు సాంగ్స్, అలానే ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయి బన్నీ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇక ఈ సినిమాలోని సామజవరగమనా, రాములో రాముల సాంగ్స్ రెండూ కూడా యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ అందుకుని సరికొత్త రికార్డ్స్ నెలకొల్పాయి. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, 

 

పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ యొక్క మూలాన్ని కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ గారు హీరోగా తెరకెక్కిన ఇంటిగుట్టు అనే సినిమా నుండి తీసుకోవడం జరిగిందని కొద్దిరోలుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా దీని పై పూర్తిగా వాస్తవాలు వెల్లడి కావలసి ఉండగా, ప్రస్తుతం ఈ సినిమా విషయమై బన్నీ ఫ్యాన్స్ లో ఒక అనుమానం మొదలైందట. అదేమిటంటే, కొన్నాళ్ల క్రితం పవన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే. 

 

అంతేకాక ఆ సినిమా విషయమై త్రివిక్రమ్ ఒక ఫ్రెంచ్ సినిమాను కాపీ కొట్టి తీసారని అదే సమయంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన అలవైకుంఠపురములో సినిమా టీజర్ ని బట్టి చూస్తుంటే కొంతరకు అజ్ఞాతవాసి ఛాయలు కనిపిస్తున్నాయని, కాపీ సినిమాగా రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచిన ఆ సినిమా మాదిరిగా ప్రస్తుతం అలవైకుంఠపురములో కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని కొందరు వ్యాఖ్యానిస్తుండడంతో, నిజంగా అదే జరుగుతుందా అనే అనుమానం బన్నీ ఫ్యాన్స్ లో మొదలైందట. అదే కనుక జరిగితే ఇప్పటికే నాపేరు సూర్య తో ఒక ఫ్లాప్ ని చవిచూసిన బన్నీ, మరొక ఫ్లాప్ ని కూడా మూటగట్టుకోవలసివస్తుందని ఆందోళన చెందుతున్నారట. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో, అలానే ఈ సినిమా ఎంతమేరకు సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే రాబోయే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: