రజినికాంత్  సినిమాలంటే చాలు ఎక్క‌డా లేని క్రేజ్ అంతా ఇక్క‌డే ఉంటుంది. అందులోనూ  తెలుగు ప్రేక్షకుల్లో ఆయ‌న‌కుండే హ‌వా అంతా ఇంతా కాదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇక్క‌డ ఉన్న తెలుగు హీరోలకు కూడా ఆ స్థాయి క్రేజ్ ఉండదు.  అందుకే ఆయన సినిమా హక్కుల కోసం ఇక్కడి నిర్మాతలు ఎక్కువగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక హీరోకి ఉండే ఫ్యాన్స్ మ‌రో హీరోకి ఉండ‌రు. కానీ ర‌జ‌నీ విష‌యంలో మాత్రం అలా కాదు. తెలుగులో దాదాపు అందరి హీరోల అభిమానులు రజని కాంత్ కి అభిమానులే కావడం విశేషం. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితులు కాస్త మారాయి. క‌బాలీ, కాలా, పేట వ‌రుస ప్లాపులు  దీంతో ర‌జ‌నీ సినిమాల‌కు బ‌య్య‌ర్లు క‌రువ‌య్యారు. ఇక ఇప్పుడు `ద‌ర్బార్` మురుగ‌దాస్ డైరెక్ట‌ర్ కొనేందుకు కూడా దిక్కులేదు. హిట్ అయినా వ‌సూళ్లు ఉంటాయ‌న్న గ్యారెంటీ లేదు.. పోటీ గ‌ట్టిగా ఉంది మూడు తెలుగు సినిమాలు గ‌ట్టి పోటీలో ఉన్న విష‌యం తెలిసిందే  అందులోనూ సంక్రాంతికి బ‌రిలో దిగ‌బోతున్నారు. మ‌రి ర‌జ‌నీ ప‌రిస్థితి ఏమ‌వుతుందో వేచి చూడాలి. 

 


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి సినిమా 'దర్బార్‌'. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. సుభాస్కరన్‌ భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా, సునీల్‌శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవ‌లె  విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా విడుదల కానుంది.

 


'ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్' అంటున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్ చే తిలో గన్‌ ఉందని రజనీకాంత్‌కి గురి పెడితే? బుల్లెట్‌ కంటే స్పీడుగా ఆయన చేతిలో కత్తి వేటుకు విలన్‌ రక్తం చిందుతుంది! ఆయన కొట్టడం మొదలుపెడితే? ఆ ఫైట్‌లోనూ ఓ స్టైల్‌ ఉంటుంది! ఓ గ్రేస్‌ ఉంటుంది! ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసే మేనియా ఉంటుంది! ఆయన డ్యాన్స్‌ చేస్తే? థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేయాల్సిందే. చప్పట్ల మోత మోగాల్సిందే! థియేటర్లలోనే కాదు... రజనీకాంత్‌ కొత్త సినిమా ట్రైలర్‌ యుట్యూమ్‌లో విడుదలైనా సందడి సందడిగా ఉంటుంది. 'సార్‌! వాళ్ళకు చెప్పండి... పోలీసుల దగ్గరకు లెఫ్ట్‌లో రావొచ్చు. రైట్‌లో రావొచ్చు. స్ట్రైయిట్‌గా రావొద్దని` 'ఆ చూపేంటి? ఒరిజినల్‌గానే విలన్‌ అమ్మా! ఇది ఎలా ఉంది?' 'అయామ్‌ ఎ బ్యాడ్‌ కాప్‌' అని రజనీకాంత్‌ చెప్పిన డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: