భారీ మార్కెట్ ఉన్న టాలివుడ్ ఇండ‌స్ట్రీ  ఇప్పుడు ప్రయోగాలకు భయపడుతుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సాధారణంగా ఇతర భాషల్లో ప్రయోగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దర్శకులు కూడా ప్రయోగాలకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. బాలీవుడ్‌లో సల్మాన్, షారూక్, అమీర్, అక్షయ్ కుమార్ ఇలా చాలా మంది స్టార్ హీరోలు ప్రయోగాలు చేసేసారు. ప్రేక్ష‌కుల‌కు ఏదో ఒక కొత్త‌ద‌నం చూపించాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త క‌థ‌లు, క‌థ‌నాల‌తో వీళ్ళు మ‌న ముందుకు వ‌స్తుంటారు. 

 

ఇక తమిళంలో సూర్య, విజయ్ సేతుపతి, విజయ్ వంటి యువ హీరోలు కూడా ప్రయోగాలు చేస్తున్నారు. అయితే మన తెలుగులో మాత్రం ప్రయోగాలు అంటే చాలు భయపడే పరిస్థితి ఏర్పడింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలు, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలు కూడా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడటం లేదు. వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్ వంటి హీరోలు అడపాదడపా ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వాటిలో కొంద‌రు విజ‌యం సాధిస్తే మ‌రికొంద‌రు తిరిగి కోలుకోలేని డిజాస్ట‌ర్ల‌ను చ‌విచూస్తున్నారు. 

 

ఇక చిరంజీవి న‌టించిన సైరా న‌ర్సింహారెడ్డి సినిమా క‌థ బానేవున్నా అనుకున్నంత హిట్ మాత్రం కాలేదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే చిరంజీవికి సైరా ఒక ప్రయోగం లాంటి చిత్ర‌మ‌నే చెప్పాలి. ప్ర‌భాస్ సాహో  చిత్రం కూడా పెద్ద బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన చిత్రం కానీ  భారీగా న‌ష్ట‌పోవ‌డంతో ఇప్పుడు అంద‌రూ సేఫ్ జోన్ వైపే మొగ్గు చూపుతున్నారు ఈ కోణంలో ఎవ్వ‌రైనా స‌రే మ‌రీ భారీ న‌ష్టాల్లోకి వెళ్ళాలంటే కాస్త ఆలోచించే ప‌రిస్థితే ఏర్ప‌డుతుంది. దాంతో భారీగా న‌ష్టాల్లోకి వెళుతున్నారు. ఇక ప్ర‌యోగాలు చేయాలంటే మాత్రం ప్ర‌తి ఒకళ్ళూ ప్ర‌యోగాలు చేయాలంటే మాత్రం చేయ‌టం లేదు. అలాగే రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం చిత్రంలో ఒక చెవిటివాడి పాత్ర‌లో న‌టించి ఒక ర‌కంగా ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. ఇలా కొంద‌రికైతే సెట్ అవుతున్నాయి ఇంకొంద‌రికి సెట్ అవ్వ‌వు. చివ‌రికి మ‌న హీరోలు ఏమి చేస్తారో ఏంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: