ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత కొనసాగుతునే ఉంది అయితే ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నా చాలామందికి రెండవ సినిమా అవకాశాలు కూడ రావడం లేదు. ముఖ్యంగా  సీనియర్ హీరోలకు ఈ హీరోయిన్స్ సమస్య మరీ ఎక్కుకవగా కనిపిస్తోంది. 

ఇలాటి పరిస్థితులలో ప్రస్తుతం అవకాశాలు లేక సతమతమైపోతున్న కేథరిన్ కు ఒకేసారి బాబాయ్ అబ్బాయిలు అదృష్టంగా మారడం హాట్ న్యూస్ గా మారింది. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కోసం కేథరిన్ ని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. 

ఈ చిత్రం కోసం ఆమెకు కేరీర్ లోనే హైయస్ట్ గా 80 లక్షల పారితోషికం ఇచ్చారన్న వార్తలు విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఆమె లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ సినిమాలో కూడ హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ నందమూరి యంగ్ హీరోతో కొత్త దర్శకుడు వేణు మల్లిడి చెయ్యబోతున్న సోషియో ఫాంటసీ సినిమాలో కేథరిన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.  ఈ సినిమాకు ‘రావణ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. 

ఈ మూవీలో కళ్యాణ్ రామ్ చాల డిఫరెంట్ గెటప్ లో కనిపించడమే కాకుండా ఈ మూవీ కథ కూడ చాల విభిన్నంగా ఉంటుంది అని అంటున్నారు. కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంత మంచి వాడవిరా’ మూవీ విడుదల తరువాత ఈ మూవీ ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎటువంటి పరిమితులు విధించని కేథరిన్ క్రేజ్ బాబాయ్ అబ్బాయిలకు ఒకేసారి ఎలా సహకరిస్తుందో చూడాలి. వాస్తవానికి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ల సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వెళ్ళనున్న నేపధ్యంలో కేథరిన్ వీరిద్దరికీ సమన్యాయం పాటిస్తూ ఆమె డేట్స్ ను బాబాయ్ అబ్బాయిలకు సమానంగా పంచినట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: