సాధారణంగా సినిమాల్లో హీరోలకే ఎక్కువ పేరొస్తుంటుంది. ఎందుకంటే సినిమా నడిచేది హీరో మీదే కాబట్టి పేరు కూడా ఆయనకే వస్తుంది. అయితే కొన్ని సార్లు సినిమాలు హీరోల మీద కంటే క్యారెక్టర్ల మీదే ఆధారపడి ఉంటాయి. ఆ క్యారెక్టర్లే సినిమాని నడిపిస్తాయి. అవి ప్రేక్షకుల మనసుల్లో ఎంత లోతుగా పడిపోతాయంటే అందులో హీరో ఎవరనేది కూడా మర్చిపోతారు. ఆ క్యారెక్టర్లు మాత్రమే గుర్తుంటాయి. అలా ప్రస్తుతం వచ్చిన సినిమాల్లో ప్రతి రోజూ పండగే పరిస్థితి కూడా అలాంటిదే.

 

మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ఈ వారం బాక్సాఫీసు వద్ద రిలీజైన అన్ని సినిమాల్లో కెల్లా మంచి చిత్రంగా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో సాయితేజ్ కంటే క్యారెక్టర్ ఆర్టిస్టులకే ఎక్కువ పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉందని అర్థం అవుతుంది. ముఖ్యంగా తాతయ్యగా సత్యరాజ్ అదరగొట్టాడు.

 

ఇకపోతే మరో ముఖ్యమైన క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి. సత్యరాజ్ కొడుకుగా చేసిన రావు రమేష్ గారి పాత్ర అదిరిపోయింది. అస‌లు ప్ర‌తి రోజూ పండ‌గే సినిమాకు హీరో ఎవ‌రు అంటే కూడా రావు ర‌మేష్ పేరే చెప్పాలి. కెరీర్లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే పెర్ఫామెన్స్‌తో ఆయ‌న త‌న‌దైన ముద్ర వేశాడు. స‌రైన పాత్ర ప‌డితే రావు ర‌మేష్ ఎలా చెల‌రేగిపోతాడో ఈ సినిమా రుజువు చేసింది. కొన్ని సన్నివేశాల్లో ఆయన హావాభవాలు,  ఆయన పలికే మాటలు హైలైట్ గా నిలిచాయి.

 

మొత్తానికి ఈ సినిమాలో సాయితేజ్ కంటే రావు రమేష్ కే ఎక్కువ పేరొచ్చిందని తెలుస్తుంది. సినిమాకి రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. ఇక ప్రస్తుతం వచ్చిన నాలుగు సినిమాల్లో ఈ సినిమానే సక్సెస్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: