నందమూరి బాలకృష్ణ నటించిన తన తండ్రి నందమూరి తారకరామారావు జీవితానికి సంబంధించిన ఎన్టీఆర్ బయోపిక్ లు కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటించిన 'రూలర్' సినిమా ఇటీవల విడుదలైంది. అయితే సినిమాల్లో బాలయ్య బాబు కొత్త లుక్ మరియు టీజర్ చూసి నందమూరి ఫ్యాన్స్ ముందే చేతులెత్తేశారు. దీంతో ‘రూలర్’ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతంతమాత్రంగానే జరిగింది. ఏది ఏమైనా డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా మొదటి షోకే అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశ లో మునిగిపోయారు. అయితే ఈ సినిమా అయిన వెంటనే బాలయ్య బాబు జనవరి నెల నుండి తనకి రెండు సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం అందరికీ తెలిసినదే.

 

అయితే ఈ సినిమాతో పాటు బాలయ్య బాబు మరో కొత్త సినిమా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విషయంలోకి వెళితే బాలయ్యబాబు కెరియర్లో వన్ ఆఫ్ ద సూపర్ సూపర్ హిట్ గా నిలిచిన ఆదిత్య 369 సినిమా సీక్వెల్ చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు సమాచారం. అప్పట్లో ఈ సినిమాను సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించడం జరిగింది. క‌మ‌ర్షియ‌ల్ గా, మ్యూజిక‌ల్ గా కూడా ఆ సినిమా ఆక‌ట్టుకుంది.

 

అయితే ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ బాలయ్య బాబు తీయబోతున్నట్లు ఎప్పటి నుండో వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. అయితే ఇటీవల సీక్వెల్ కి సంబంధించి  డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు బాలయ్య బాబుకు స్టోరీ వినిపించినట్లు ఆ సినిమా కూడా బాలయ్య బోయపాటి తో చేయబోయే సినిమాతో పాటుగా చేసే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. అయితే ఈ సీక్వెల్ సినిమాకు ఆదిత్య 999 టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: