నోటా, 'డియర్ కామ్రేడ్` డిజాస్టర్స్ అయినప్పటికి విజయ్ దేవరకొండ క్రేజు కాస్త కూడా తగ్గలేదు. అర్జున్ రెడ్డి- గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్లు విజయ్ కి భారీ స్థాయిలో మైలేజ్ ని ఇచ్చాయనే చెప్పాలి. ఇక వీటన్నిటినీ మించి రౌడీ యాటిట్యూడ్ తో అతడు తనని తాను ప్రమోట్ చేసుకుంటున్న విధానం ఆసక్తిగా ఉంటోంది. ఈ యంగ్ హీరో ఇటు టాలీవుడ్ సహా బాలీవుడ్ .. కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారాడు. ఆ క్రమంలోనే విజయ్ నటిస్తున్న తరువాత సినిమాలపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
 

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న `వరల్డ్ ఫేమస్ లవర్` ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా రిలీజవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచారం పీక్స్ లో ఉంది. ఈలోగానే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్వకత్వంలో `ఫైటర్`లో నటిస్తున్నాడు. ఇస్మార్ట్ డైరెక్టర్ తో సినిమాని ప్రకటించగానే రౌడీ ఫ్యాన్స్ లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాలో విజయ్ ఇప్పటివరకు చూడని విధంగా యాక్షన్ హీరోగా ప్రజెంట్ చేయబోతున్నాడు పూరి. ఇందులో కథానాయిక ఎవరు?  విలన్ ఎవరు? అన్నదానిపైనా ఇప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. రౌడీ సరసన నటించే హీరోయిన్స్ జాన్వీ కపూర్ లేదా కియరా అద్వానీ అంటూ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు ఎవరినీ కన్ఫామ్ చేస్తూ పూరి-చార్మి బృందం ప్రకటించలేదు.

 

ఇక తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ సినిమాలో ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ అతిధి పాత్రలో నటించే అవకాశం ఉందన్న చర్చా ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. అంతేకాదు కార్తికేయ విలన్ గా నటించే అవకాశం ఉందన్న టాక్ తాజా వార్త బయటకు వచ్చింది. ఇక కార్తికేయ రీసెంట్‌గా నానీస్ గ్యాంగ్ లీడర్ లో విలన్ గా నటించిన క్రమంలో అతడిని అదే తరహా పాత్రకు పూరి పరిగణిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పూరి- ఛార్మి బృందంతో కరణ్ జోహార్ జాయిన్ అయ్యారు. ప్రీప్రొడక్షన్ పూర్తవుతోంది. ఇందులో కాస్టింగ్ ఎవరు?  టెక్నీషియన్స్ ఎవరు?  తదితర వివరాల్ని వెల్లడి కావాల్సి ఉంది. పూరి-కరణ్ జోడీ పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్న క్రమంలో దీనిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇక మజిలీ దర్శకుడు శివ నిర్వాణ- దిల్ రాజు కాంబినేషన్ లో దేవరకొండ నటించే 12వ సినిమాని ఇటీవల దిల్ రాజు బర్త్ డే సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2020 సెకండాఫ్ లో సెట్స్ మీదకు వెళ్ళనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: