నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’.  జై సింహా  తర్వాత  కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న భారీ అంచ‌నాల‌తో విడుద‌ల అయింది. బాల‌కృష్ణ రెండు షేడ్స్‌లో ఒక‌టి ఐటీ రంగానికి చెందిన వ్య‌క్తి.. మ‌రో షేడ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్. ఈ రెండు పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్ని సినిమా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అని చెప్ప‌క‌నే చెబుతుంది. బాలయ్య సినిమా అంటే చాలు..అభిమానులు డైలాగ్స్ ఎక్కువ కోరుకుంటారు. ఇప్పుడని కాదు ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’ సినిమాల సమయం నుంచి ఇదే వేవ్ కొనసాగుతోంది.

 

ఇక ఈ సినిమాలో కూడా డైలాగులు, బాలయ్య నటన ప్రతీ ఒక్కటి కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. రూటీన్ క‌థ‌నే అయినా బాల‌య్య ఎన‌ర్జీతో అలు అభిమానుల‌ను ఇటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న  సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లు న‌టించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా, షాయాజీ షిండే,  జయసుధ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఇదిలా ఉంటే.. బాలకృష్ణకు కొన్ని కోరికలు అలాగే మిగిలిపోయాయట… నందమూరి హీరోలు అందరు కలిసి ఒక సినిమా చేయడం, అది కూడా రైతు సినిమా చెయ్యాలని ఆయన భావించారట. 

 

మొద‌టిగా ఈ సినిమాను తన సోదరుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్నతో కలిసి చెయ్యాలని ఆయన భావించారట. ఈ నేప‌థ్యంలోనే ఓ ద‌ర్శ‌కుడితో కూడా చ‌ర్చించారు. అయితే అనూహ్యంగా హరికృష్ణ మరణించడంతో బాలకృష్ణసినిమా విషయంలో వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఈ సినిమా ప్రయత్నాలను చేస్తున్నారట. కృష్ణ వంశీ లేదా వీవి వినాయక్ తో ఈ సినిమాను బాలకృష్ణ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రి నంద‌మూరి హీరోలంద‌రూ ఒకే సినిమాలో క‌నిపిస్తే అభిమానుల‌కు పండ‌గే. మ‌రి బాల‌కృష్ణ కోరిక ఎప్ప‌టికి నేర‌వేరుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: