టాలీవుడ్ యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఈ ఏడాది మొదట్లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు రెండూ కూడా మంచి అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ, ఆ అంచనాలు అందుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాయి .ఇక ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో ఈ విధంగానే ఉండనుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న కథ, 

 

కథనాలు కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల మాదిరిగానే ఉన్నాయని, అలానే సినిమాలో ఆసక్తిని రేకెత్తించే సీన్స్ ఏమి లేవని మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ కోసం మాత్రమే దర్శకుడు కేఎస్ రవికుమార్ సినిమా తీసారా అనే మాదిరిగా ఈ సినిమా సాగుతుందని కూడా అంటున్నారు. ఇక సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు ఏవంటే, బాలయ్య అడిగిపోయే డైలాగ్స్, డ్యాన్స్, గెటప్ లు మాత్రమే అని అంటున్నారు. ఇక ఈ సినిమాపై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రస్తుతం ట్రోలింగ్ విస్తృతంగా జరుగుతోంది. 

 

అయితే వాటిలో ఎక్కువ ట్రోలింగ్ హీరో బాలకృష్ణ పై అలానే దర్శకుడు రవికుమార్ మీద కూడా సాగుతున్నాయి. మూస పద్ధతిలో సాగె పాత కథను ఈ సినిమా కోసం ఎంచుకున్న  రవికుమార్ గారికి ఇంతకంటే మంచి పాయింట్ దొరకలేదా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ట్రొలింగ్స్ ని బట్టి మేము చెప్పేది ఏంటంటే, బాలయ్య ఇకనైనా తన సినిమాల కథల విషయమై మరింతగా జాగ్రత్తగా వ్యవహరిస్తే బెటర్ అని కొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్వరలో బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు. మరి ఆ సినిమా బాలయ్యకు ఎంత మేర సక్సెస్ ని అందిస్తుందో చూడాలి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: