సినిమా తర్వాత సినిమా చేసినంత ఈజీగా.. గాళ్ ఫ్రెండ్స్ ని మార్చేయడం బాలీవుడ్ హీరో రణబీర్ కి బాగా అలవాటు. కపూర్ బోయ్ స్పీడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనోడి గురించి అటు సౌత్ లో ఇటు నార్త్ లో బాగా తెలిన సంగతే. ఇక ఇప్పటికే ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్ తో సీరియస్ గా లవ్ ఎఫైర్ నడిపాడు ఈ హీరో. దీపిక పదుకొనే.. కత్రిన కైఫ్ లాంటి టాప్ రేంజ్ బ్యూటీస్ తో ఏళ్ల తరబడి ప్రేమాయణం సాగించిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత ఆ ఇద్దరికీ సింపుల్ గా బ్రేకప్ చెప్పాడు. ఇంతకాలానికి కుదురుగా కుదురుకుంటున్నట్టే కనిపిస్తోంది. రణబీర్ ప్రస్తుతం కుర్రబ్యూటీ ఆలియాతో నిండా ప్రేమలో మునిగి ఉన్నాడు.

 

అంతేకాదు.. ఆలియాతో కలిసి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాలో నటించాడు. ఆ తర్వాత ఆలియాకి తన సరసన అవకాశాలిస్తున్నాడు. ఈలోగానే మరో బాలీవుడ్ బ్యూటీకి రణబీర్ సరసన జాక్ పాట్ తగిలింది. ఇంతకీ ఎవరా బ్యూటీ..! అంటే టాలీవుడ్ కి బాగా సుపరిచితమైన శ్రద్ధా కపూర్. ఈ బ్యూటి ఇంతకుముందు డార్లింగ్ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ స్ట్రీట్ డ్యాన్సర్ 3డి సినిమాతో కొత్త సంవత్సరంలో కొత్తగా ట్రీటివ్వబోతోంది. ఇందులో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. ఈలోగానే కొత్త సంవత్సరం రాకముందే మరో స్వీట్ న్యూస్ చెప్పింది శ్రద్ధా. హ్యాండ్సం హీరో, లవర్ బోయ్ రణబీర్ సరసన ఈ బ్యూటీ జాక్ పాట్ కొట్టేసిందిట.

 

రణబీర్ హీరోగా లవ్ రంజన్ దర్శకత్వం వహించే క్రేజీ మూవీలో శ్రద్ధా హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్యార్ కా పంచనామా లాంటి సెటైరికల్ కామెడీ మూవీని తెరకెక్కించిన లవ్ రంజన్ పేరు బాలీవుడ్ లో మార్మోగుతోంది. రణబీర్- శ్రద్ధా జోడీతో ఈ డైరెక్టర్ క్రేజీగా సినిమాని ప్లాన్ చేస్తుండడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 2021 మార్చి 26న ఈ సినిమా రిలీజ్ కానుంది. లవ్ రంజన్- అంకుర్ గార్గ్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా ఆఫర్ గురించి శ్రద్ధా ఎంతో ఎగ్జయిట్ అవుతూ.. తెగ సంబరపడిపోతుంది. మొదటిసారి రణబీర్ సరసన నటిస్తున్నందుకు అభిమానులు కూడా శ్రద్ధాకి విషెస్ చెబుతున్నారు. అయితే సినిమాల వరకు ఒకే గాని పర్స్నల్ గా మాత్రం రణబీర్ తో శ్రద్ధా కొంచెం కేర్ ఫుల్ గా ఉండాలని సూచిస్తున్నారు. మరి ఈ మాట శ్రద్ధా వింటుందా లేక పెడ చెవిన పడేస్తుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: