అక్కినేని సమంత మైండ్ సెట్ ని క్లోజ్ గా పరిశీలిస్తున్న చాలా సంగతులే అర్థమవుతాయి. ఆఫ్టర్ మ్యారేజ్ ఛేంజోవర్ స్పష్టంగానే అర్థమవుతుంది. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియేంటెడ్ సినిమాలతోనూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ముందుగా చేసిన యూటర్న్ ఆ తరహా ప్రయత్నమే. కానీ ఫలితం ఆశించిన విధంగా రాలేదు. అటుపై కొరియన్ మూవీ మిస్ గ్రానీ తెలుగు రీమేక్ ఓ బేబి పెద్ద సక్సెసైంది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో అక్కినేని కోడలు ఐడెంటిటీ మరింత పెరిగింది. సమంత మార్క్ పెర్ఫామెన్స్ విజువల్ ప్రెజెన్స్ ఆ సినిమాకు బాగా కలిసొచ్చాయి. తాజాగా ఆ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరోసారి లేడీ ఓరియేంటెడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం.

 

కోలీవుడ్ లో మాయ.. గేమ్ ఓవర్ లాంటి హారర్  సస్పెన్స్ థ్రిల్లర్లను తెరకెక్కించిన అశ్విన్  శరవణన్ దర్శకత్వంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సామ్ దెయ్యం పాత్ర పోషించనుందని ప్రచారం సాగుతోంది.  హత్యాచారానికి గురై .. అటుపై కక్ష సాధింపుగా ఆత్మ రూపంలో ఆ మృగాలను అంతమొందించే రోల్ లో కనిపించనుందిట. ప్రస్తుతం భారతదేశంలో దిశ లాంటి కేసులు సంచలన రేపుతోన్న నేపథ్యంలో  ఇలాంటి కథలను కమర్శియల్ గా వర్కౌట్ చేయగలిగితే సమాజానికి సందేశం అందించినట్లు ఉంటుంది. మరి ఈ  ప్రచారంలో వాస్తవం ఎంత? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే సమంత రాజుగారి గది-2లో ఆత్మ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

 

ఇక సమంత హీరోయిన్ గా బిజీగా ఉంది. ప్రస్తుతం 96 రీమేక్ లో నటిస్తోంది. రీసెంట్‌గానే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. హిందీలో ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ పోషిస్తోంది. నాగచైతన్య- పరుశురాం కాంబినేషన్ లో తెరకెక్కనున్న మ్రఓ కొత్త సినిమాలోనూ సామ్ హీరోయిన్ గా నటించనుందని ప్రచారం సాగుతోంది. ఇందులోనూ సామ్ చైకి భార్య పాత్రలో కనిపించనుందిట. ఈ షెడ్యూల్స్ పూర్తయితే.. ఆ తర్వాత సమంత మామ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.  అందుకే కొత్త సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికి సమంత అంగీకరించడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: