జబర్దస్త్ షో ఎంత ఫేమస్ అయిందో అదే స్థాయిలో దాదాపుగా పటాస్ షో కూడా మంచి హైప్ వచ్చింది. ఈ షోకి యాంకర్ రవి, శ్రీముఖిలు వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తున్నారు. ఒక ఈ షోలో వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ మాములుగా ఉండదు. ఇక శ్రీముఖి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలె బిగ్ బాస్ షోలో రన్నరప్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె తన కంబ్యాక్ షోగా ప్రారంభించిన స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ విజయవంతంగా దూసుకెళుతోంది. ముఖ్యంగా ఈ షోలో శ్రీముఖి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే పటాస్ షో ద్వారా పాపులర్ అయిన శ్రీముఖి ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి తన ఇమేజ్ ను అమాంతంగా పెంచేసుకుంది. అంతేకాదు బయటకు రాగానే ఒక భారీ ప్రోగ్రాం ద్వారా తన కమ్ బ్యాక్ తో విజయం సాధించింది. అయితే అదే షో నుంచి బయటకు వచ్చిన పటాస్ రవి కూడా లోకల్ గ్యాంగ్స్ పేరుతో ఒక కొత్త ప్రోగ్రాం ప్రారంభించారు. రవి ఎప్పటి లాగే తన ఎనర్జీ పెర్ఫార్మెన్స్తో లోకల్ గ్యాంగ్స్ ను తన భుజాలపై వేసుకున్నాడు. ఇంతలోనే తాజాగా రెండు ప్రోగ్రామ్స్ టీఆర్పీ రేటింగ్ విషయంలో పోటీ పడుతున్నాయి. ఇందులో మాత్రం శ్రీముఖి తన సత్తా చాటింది. లోకల్ గ్యాంగ్స్ కన్నా స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ ప్రోగ్రాం మెరుగైన టీఆర్పీ రేటింగ్స్ సాధించింది.
ఒక వైపు యాంకర్ రవి, శ్రీముఖి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజులో గొడవలు జరుగుతున్నాయనేది బయట టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రవి హోస్ట్ చేస్తున్న లోకల్ గ్యాంగ్స్ కన్నా శ్రీముఖి హోస్ట్ చేస్తున్న స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ ప్రోగ్రాం రేటింగ్స్ పరంగా ముందు వరుసలో దూసుకెళ్ళిపోవడం ఒక సంచలనంగా మిగిలింది. అయితే వీరిద్దరి మధ్య పోటీ ఇప్పుడే ఇలాగ ఉంటే ముందు ముందు ఏ రేంజులో వీరిద్దరి మధ్య పోటీ వేడెక్కుతుందనేది హాట్ టాపిగ్గా మారింది.
మరి వీరిద్దరూ పటాస్ షో నుంచి తప్పుకుంటే ఎంతో హిట్ అయిన పటాస్ ప్రోగ్రాం ఏమయిందో తెలియదు. దానికి వేరే ఎవరైనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారా లేదంటే వీళ్ళు ఇద్దరూ ఒకేసారి బయటకు రావడంతో ఏకంగా ఆ ప్రోగ్రామ్‌నే ఆపేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది.