గత ఏడాది కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలె ప్రొడక్షన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన కన్నడ సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1, మన తెలుగులో కూడా ఎంతటి అత్యద్భుత విజయాన్ని అందుకుందో మనకు అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్ 2 మరింత భారీగా మరియు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు హోంబలే ప్రొడక్షన్స్ వారు. 

 

ఇక ఈ సినిమాలో కీలకమైన అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండగా పలువురు కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎనభై శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేసింది కెజిఎఫ్ యూనిట్. ఇక రిలీజ్ అయిన ఆ పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా చాప్టర్ 1 ని మించిపోయేలా ఉండడంతో పాటు, 

 

ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి గట్టి పోటీ కూడా ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతోందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పోస్టర్లో 'రి బిల్డింగ్ యాన్ ఎంపైర్' అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. తన అనుచరుల సాయంతో రాఖీ తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు దాని అర్ధం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేయనుంది సినిమా యూనిట్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: