నితిన్.. తేజ దర్శకత్వం వహించిన జయం మూవీ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బ్యాచిలర్ హీరోల్లో నితిన్ ఒకరు. అయితే గతంలో నితిన్ ఓ అమ్మాయిని ప్రేమించాడని, డేటింగ్ లో ఉన్నాడని వార్తలొచ్చాయి. ఆతర్వాత ఇలాంటి వార్తలు తగ్గడమే కాకుండా కెరీర్ మీద దృష్టి పెట్టాడు నితిన్. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో రష్మిక మందన హీరోయిన్ గా, భీష్మ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా టీజర్ విడుదలై ఆడియన్స్ ని అలరించింది. ఇక ఈ చిత్రమే కాకుండా వెంకీ అట్లూరి, చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో రెండు మూవీస్ సెట్స్ మీదికి వెళ్ళాలి. నితిన్ ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలతో బిజీగానే ఉన్నాడు.

 

 

ఇకపోతే దుబాయ్ లో ఏప్రిల్ 15 న నితిన్ వివాహం జరగనుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. అయితే పెళ్లి కూతురు ఎవరనే విషయాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచారు.. ఇక టూకీగా తెలిసిన వివరాల ప్రకారం నితిన్ అసలు సినిమా జీవితంతో సంబంధం లేని సాంప్రదాయ రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడని సమాచారం.

 

 

ఆమె డాక్టర్ అట. ఇక ఈ పెళ్లికి ఎక్కువమంది కాకుండా కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వచ్చేలా ప్లాన్ చేశారట నితిన్ ఫ్యామిలీ. ఎందుకంటే పెళ్లి జరిగేది దుబాయిలో కదా. ఇక నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ పెళ్లిలో ఎలాంటి హడావిడి లేకుండా కేవలం కుటుంబ వ్యవహారంగానే ఉండాలని భావిస్తున్నారట. అయితే మ్యారేజ్ రిస్పెషన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారట.

 

 

పెళ్లికూతురు ఎవరో గోప్యంగా ఉంచారు. కాకపొతే వచ్చే ఏప్రియల్ 15న పెళ్లి డేట్ ఫిక్స్ చేసినట్లు ఫిలిం నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇకపోతే నితిన్ 2020లో కొత్త సినిమాలతో రావడమే కాదు పెళ్లితో కూడా కొత్తజీవితం ప్రారంభించ బోతున్నట్లు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: