తండ్రి ఎన్టీఆర్ జీవితం మీద తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఫ్లాప్ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘రూలర్’. బాలయ్యతో ‘జై సింహా’ వంటి మంచి హిట్ అందించిన కే.యస్.రవికుమార్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు.  సీ కళ్యాణ్ సినిమాని నిర్మించగా, చిరంతన్‌ భట్ సంగీతమందించాడు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం  టాక్ తేడాగా వచ్చింది. 

 

బాలకృష్ణ సినిమా అంటేనే వన్ మ్యాన్ షో లాగా ఉంటుంది. ఇందులోను అదే కనిపిస్తుంది. రొటీన్ కథే అయినప్పటికీ స్క్రీన్ ప్లే లో కొత్తదనం చూపించలేకపోయాడు దర్శకుడు. బీసీ కాలం నాటి కథకి యుపీ బ్యాక్ గ్రాప్ ని యాడ్ చేసి బాలకృష్ణని ఓ కొత్త లుక్ లో ప్రెజెంట్ చేశాడు దర్శకడు. దీంతో తొలిరోజే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా ఆశించినంతగా రావడం లేదు. ఈ చిత్రం తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.40 కోట్ల షేర్ వసూలు చేసింది. 

 

ఇక మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టుకున్న రెండవ రోజు మాత్రం బాడ్ టాక్ వలన పెద్దగా ఆ ఓపెనింగ్స్ స్థాయి కలెక్షన్స్ ని సెకండ్ డే కంటిన్యూ చేయలేకపోయింది. ఆంధ్ర – తెలంగాణాలో 21.5 కోట్లకి అమ్ముడు పోయిన రూలర్ సినిమా మొదటి రోజు 4.40 కోట్ల షేర్ తో సూపర్బ్ అనిపించుకుంటే, రెండవ రోజు కేవలం కోటి రూపాయల షేర్ మాత్రమే సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడిపోయింది.  దీన్నీ బట్టే చెప్పచ్చు సెకండ్ డే రూలర్ కి భారీగా డ్రాప్స్ వ‌చ్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు. 

 

‘రూలర్’ రెండు రోజుల ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:

 

నైజాం- 1.01 కోట్లు 

 

సీడెడ్- 1.38 కోట్లు

 

గుంటూరు- 1.42 కోట్లు

 

ఉత్తరాంధ్ర- 44  లక్షలు

 

తూర్పు గోదావరి- 35   లక్షలు

 

పశ్చిమ గోదావరి- 30   లక్షలు

 

కృష్ణా- 26 లక్షలు

 

నెల్లూరు- 27 లక్షలు
-------------------------------------------------------
రెండు రోజుల మొత్తం షేర్- 5.43కోట్లు  
--------------------------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: