టాలీవుడ్ లో ఒకప్పుడు కొంతమంది హీరోలు మాత్రమే ఉండేవారు. ఏ సినిమా తీయాలన్న ఆ హీరోలు మాత్రమే చేసేవారు. ఇప్పుడు మాత్రం టాలీవుడ్ లో  హీరోల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ప్రతీ కథకు తగ్గ హీరో టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్నాడు . అంతేకాదండోయ్ సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అంటూ టాలీవుడ్ లో అందరూ అభిమానులను కుషి  చేస్తున్నారు హీరోలు. సీనియర్ హీరోలు అయినా వెంకటేష్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున లు ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన వాళ్లే. ఒకప్పుడు దర్శకుల అందరికీ ఈ నలుగురే  కేరాఫ్ అడ్రస్. ఎలాంటి సినిమాలు చేయాలన్న  ఈ నలుగురు స్టార్ హీరోలు మాత్రమే  ఉండడంతో ఏ  సినిమాలో చుసిన  ఈ నలుగురు హీరోలే  కనిపించేవారు. 

 

 

 

 కానీ ఇప్పుడు మాత్రం సీనియర్ హీరోలతో పాటు జూనియర్ హీరోలు డజనుకు  పైగానే ఉన్నారు టాలీవుడ్ లో. దీంతో అభిమానులకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా తక్కువ  లేకుండా అయింది. వారం వారం కొత్త సినిమాలు విడుదలవడం తమ అభిమాన హీరోలు బాక్సాఫీస్ వద్ద సందడి  చేస్తుండడంతో... తెలుగు ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఓవైపు సీనియర్ హీరోలు అందరూ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తుంటే  మరోవైపు జూనియర్ హీరోలు కూడా వరుస సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్నారు . తెలుగు ప్రేక్షకులందరికి  వీనులవిందు చేస్తున్నారు  . 

 

 

 అయితే హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస అవకాశాలు దక్కించుకుంటూ సినిమాలు  చేస్తున్నారు సీనియర్ హీరోలు   జూనియర్ హీరోలు. సీనియర్  హీరోలు కూడా నేటి తరం యువ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటికీ జూనియర్ హీరోల లెవెల్లో సీనియర్  హీరోలు అభిమానులందరినీ అలరిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. నేటితరం స్టార్ హీరోలు కూడా... కమర్షియల్ సినిమా లే కాకుండా వైవిధ్యంగా సినిమాలు చేస్తూ  తమలోని నటులను ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం జూనియర్ హీరోలందరూ కమర్షియల్ సినిమాల కంటే వైవిధ్యత్మక  సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. ఏదేమైనా వారం వారం సరికొత్త సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అభిమానులను ఖుషీ చేస్తున్నారు అందరు హీరోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: