విజయ్ దేవరకొండ హీరోగా పురి జగన్నాథ్ దర్శకత్వంలో "ఫైటర్" అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమా కొసం పూరి చాలా కసరత్తులే చేస్తున్నాడట. ఈ సినిమాని పాన్ ఇండియా బేస్ లో తెరకెక్కించడానికి వీలుగా సినిమా కథని సిద్ధం చేశాడట. ఫైటర్ లో విజయ్ కి జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

 


బాలీవుడ్ లీ ఫైటర్ కి ఇమేజ్ తేవడానికి కరణ్ జోహార్ ని పట్టుకున్నారు. విజయ్ చొరవ మూలంగానే కరణ్ ఈ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఫైటర్ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ని నటింపచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఒకవేళ మైక్ టైసన్ గనక ఒప్పుకుంటే ఈ సినిమా రేంజ్ ఎక్కడికో పోతుందనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

 

 

తాజాగా సినిమాలో మరో నాయిక కూడా విజయ్ తో రోమాన్స్ చేయబోతుందని తెలుస్తోంది. పూరి- ఛార్మీ ముంబైలో మకాం వేసి సెకెండ్ హీరోయిన్ ఎంపిక చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ముంబై లో జల్లెడ పడుతున్నారు అంటే.. పూరి మరోసారి కొత్త మోడల్ ని దిగుమతి చేసే అవకాశం ఉంది. పూరి ఎక్కువగా కొత్త హీరోయిన్ల నే తన సినిమాలో తీసుకుంటాడు. ఈ సినిమాలో కూడా మరో కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారట.

 


ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పురి జగన్నాథ్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా చూడాలి. అలాగే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: