తెలుగు సినిమా అంటే వందమందిని చితకబాదే హీరో, అందమైన హీరోయిన్, విలన్ చుట్టూ పది కార్లు ఇలా ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టే. కానీ ఇప్పుడు అలా కాదు పాత తరం పప్పులు ఏమాత్రం ఉడకడం లేదు. కాలం మారేకొద్దీ సినిమా కూడా మారింది.. చూసే ప్రేక్షకులు మారారు.. ఆలోచన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్త‌వానికి టాలీవుడ్‌లో హీరోలదే డామినేషన్‌. హీరో చుట్టూ సినిమా ఉంటుంది. హీరో ఇమేజ్‌ ప్రకారం బిజినెస్‌ జరుగుతుంది. అందుకే హీరోలకు లాంగ్‌ కెరీర్‌ ఉంటుంది. అదే హీరోయిన్‌ల విషయానికి వస్తే వీరిది పరిమిత కాలమే. 

 

పదేళ్ళకు మించి సినీరంగంలో నిలదొక్కుకోవడం కష్టం. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లు కొన్ని సీన్ల‌కు, పాట‌ల్లో డ్యాన్సుల‌కు, గ్లామ‌ర్ ఒల‌క‌బోసేందుకు ప‌రిమితం అవుతున్నారు. అయినప్పటికీ మాస్‌ ప్రేక్షకులను ఆకర్షించడానికి అందాల భామలకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే హీరోలతో సమంగా మార్కెట్‌ ఏర్పరచుకున్న సావిత్రి, విజయశాంతి, సౌందర్య తర్వాత మళ్లి ఆ స్థాయి నాయికలు రాలేదు. అయితే అనుష్క, న‌య‌న‌తార‌ మాత్రం మినహాయింపు ఇవ్వవచ్చు. ఎందుకంటే తెలుగులో లేడీ ఓరియంటెడ్ చాలా త‌క్కువ‌ని చెప్పాలి. కానీ.. లేడీ సూపర్‌స్టార్‌ నయనతార‌, అనుష్క‌.. లేడీ ఓరియంటెడ్ సినిమాల‌కు కేరాఫ్‌గా మారారు.అనుష్క కూడా కెరీర్‌ బిగినింగ్‌లో ఆడిపాడే బొమ్మగానే కనిపించింది. 

 

విక్రమార్కుడుతో కమర్షియల్‌ నాయికగా పేరు తెచ్చుకుని, అరుంధతి చిత్రం ద్వారా స్టార్‌డమ్‌ సొంతం చేసుకుంది. అప్పుడే అనుష్కతో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలు తీయవచ్చనే నమ్మకం నిర్మాతలకు కలిగింది. మ‌రియు సోలోగా సినిమాను నడిపించేస్తూ.. బాక్సాఫీస్ వద్ద హిట్లు కొడుతున్న నయనతారపై డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌కు వంద శాతం నమ్మకం ఏర్పడింది. అందుకే ఆమె సినిమాలో హీరో లేకపోయినా ఫర్వాలేదు అనుకుని కమెడియన్ల కూడా పెట్టి సినిమాలు తీసేవారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు ప‌క్క‌న పెడితే.. మిగిలిన సినిమాల్లో హీరోయిన్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌నే చెప్పాలి. కేవ‌లం నాలుగు సీన్ల‌కు, గ్లామ‌ర్ ఒల‌క‌బోసేందుకు ప‌రిమితం చేస్తున్నారు ద‌ర్శ‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: