సినిమాల్లో నటించే నటీనటులు కామన్‌గా మతం మార్చుకోవడం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ మతం మార్చుకున్న వారిలో జయసుధగారు కూడా ఉన్నారు. ఈవిడ క్రిస్టియన్ మతంలోకి మారారు. ఇక హీరోలను చూసుకుంటే సర్వసాధారణంగా కనిపించరు. కాకపోతే ఎవరొ ఒకరిద్దరు మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఇకపోతే 2002లో విజయ్ హీరోగా తెరకెక్కిన భగవతి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జై తరువాత జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. అంతే కాకుండా ఈ కోలీవుడ్ యువ నటుడు జై. సోలో హీరోగా తన సత్తా చాటాడు.

 

 

ప్రస్తుతం జై కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాలతో పాటు ఆ మద్య తెలుగమ్మాయి అంజలితో ప్రేమాయణంతో కూడా వార్తల్లో నిలిచాడు ఈ యంగ్ హీరో. ఇకపోతే ఇన్నాళ్లూ అంజలితో కలసి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ యంగ్ హీరో మేమిద్దం కేవలం ఫ్రెండ్స్‌ మాత్రమే అంటున్నాడు. అయితే వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో నడుస్తున్న పుకారు కోలీవుడ్‌ మీడియాలో తరుచూ వినిపిస్తుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా జై మరో ఆసక్తి కరమైన అంశంతో వార్తల్లో నిలిచాడు.

 

 

అదేమంటే ఈ యంగ్ హీరో మతం మార్చుకున్నట్టుగా వెల్లడించాడు. గత ఏడేళ్లుగా తాను ఇస్లాంను పాటిస్తున్నట్టుగా వెల్లడించిన జై తన తాజా చిత్రం కేప్‌ మారి ప్రమోషన్‌ సందర్భంగా తాను మతం మార్చుకున్న విషయాన్ని వెల్లడించాడు.. అంతేకాదు తన నిర్ణయానికి కుటుంబం సభ్యులు కూడా మద్ధతు తెలిపారని.. ఏ దేవుడిని నమ్మకుండా ఉండే కన్నా ఏదో ఒక దేవుడిని నమ్మటం బెటర్‌ అని వాళ్లు భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపాడు.

 

 

ఇంతే కాకుండా త్వరలో జై తన పేరును అజీస్‌ జైగా మార్చుకో బోతున్నట్టుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ విషయం తెలిసిన వారు కొందరు సమాజంలో ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్చగా బ్రతికే అవకాశం ఉన్నప్పుడు జై తన యిష్టాన్ని ఇలా తీర్చుకుంటున్నాడని అనుకుంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: