టాలీవుడ్ లో హీరో ల సంఖ్య భారీగా పెరిగిపోయింది... చిన్న హీరోల నుండి  బడా హీరోలు వరకు  చాలామంది ఉన్నారు... దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. ఇంకేముంది బాక్సాఫీస్ దగ్గర వరుస  సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. దేశంలోనే ఎక్కువగా సినిమాలు తీసే  ఇండస్ట్రీ ఒక్క టాలీవుడ్ మాత్రమే. ప్రతి వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో ఒక సినిమా రిలీజ్ ఉంటూనే ఉంటుంది. విభిన్నమైన కాన్సెప్ట్ లతో హీరోలందరూ సినిమాలు తీస్తూనే ఉన్నారు. సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు చిన్న  సినిమా హీరోలు అనే తేడా లేదు  అందరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు సినిమాలు తక్కువ ఉండి సక్సెస్ రేటు ఎక్కువగా ఉండేది.

 

 

 

 కానీ ఇప్పుడు మాత్రం సినిమాలు అతి ఎక్కువగా ఉండి  సక్సెస్ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు విడుదల అయినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి . దీనికి కారణం కథ  కథాంశం బలంగా లేకుండా సినిమాలు తీయడం. ఇంకా నాటితరం కథలనే తెరకెక్కిస్తే ఉండటం. నేటి తరం ప్రేక్షకుల ఆలోచన తీరు మారింది... ఇప్పుడు సీనియర్ హీరోలు స్టార్ హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేదు. హీరో ఎవరైనా వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే మాత్రం ఆ హీరోకి భారీ విజయాన్ని కట్టబెడుతున్నారు ప్రేక్షకులు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలు కూడా వైవిద్యమైన  సినిమాలు తీసేందుకు ముందుకు వస్తున్నారు. 

 

 

 

 ఇప్పటికీ కొంతమంది దర్శకులు మూస కథలు  తెరకెక్కిస్తున్నారు అంటూ ప్రేక్షకులు అనుకుంటున్న మాట. నాటి తరం కథలు ఇప్పటికీ నేటి తరానికి బలవంతంగా రుద్దాలని  చూస్తున్నారని ప్రేక్షకుల్లో ఓ చిన్న భావన ఉంది. దర్శకులు సినిమాలు తీసే పద్ధతి ఇంకాస్త మార్చుకుంటే బాగుంటుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. బలమైన కథలు ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ లభిస్తుందని అంటున్నారు. సరికొత్త కథతో ప్రయోగాత్మక సినిమాలు తెరకెక్కిస్తే... మంచి విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు మంచి పేరు కూడా వస్తుందని సగటు ప్రేక్షకుడి భావన.

మరింత సమాచారం తెలుసుకోండి: