బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘దబంగ్ 3’ భారీ అంచనాల నడుమ డిసెంబ‌ర్ 20న విడుద‌ల అయింది.  ఈ చిత్రానికి సల్మాన్ లక్కీ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించగా.. సల్మాన్ ఖాన్, సోనాక్షిసిన్హా, కిచ్చాసుదీప్, డింపుల్ కాపాడియా, ప్రమోద్ ఖన్నా కీలకపాత్రల్లో నటించారు. 'దబంగ్', 'దబంగ్ 2' చిత్రాల్లో చుల్ బుల్ పాండేగా ఎలా మారాడో తెలియజేసే కథతో 'దబాంగ్ 3' సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో చుల్ బుల్ పాండే విలన్స్ పై ఎలా పోరాటం చేసాడు? ఖుషి ప్రేమని ఎలా దూరం చేసుకున్నాడు? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాని తప్పకుండా చుడాలిసిందే.

 

భారీ అంచనాలతో వచ్చిన చుల్‌బుల్‌పాండే మరోసారి మురిపిస్తాడనుకుంటే ఈసారి తడబడినట్లు తెలుస్తోంది. అయితే, సినీ విశ్లేషకుల విమర్శలు, తక్కువ రేటింగ్‌లు, దేశంలో కొనసాగుతున్న నిరసనలు ఇవేవీ దబాంగ్‌ 3 కలెక్షన్లకు అడ్డుగా నిలవకపోవడం గమనార్హం.  దబాంగ్‌ 3 విడుదలైన శుక్రవారం నాడు రూ.24 కోట్లు రాబట్టగా రెండో రోజు కూడా స్థిరంగా నిలబడి రూ.24 కోట్లు వసూలు చేయడం విశేషం. అలాగే దబంగ్‌,  దబంగ్ 2  సినిమాల్లో లాగే ఈ సినిమాలో ఆక్షన్ సీన్స్ కి కొదవ లేకుండా దర్శకుడు తగిన జాగ్గ్రతలు తీసుకున్నాడు.

 

ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అదిరిపోయింది. ప్రతినాయకుడిగా నటించిన కిచ్చా సుదీప్ ఎక్స్‌లెంట్ పెర్ఫామెన్స్ ఇచ్చార‌ని చెప్పాలి. అలాగే ప్రేక్షకుడిని కథలోకి లీనం చేస్తూ, సల్మాన్ ఖాన్ మాస్ డైలాగ్స్ తో మెప్పించే ప్రయత్నం చేశారు. కాగా, చాలా రోజుల తరువాత సల్మాన్ ఖాన్ తెలుగులో తన చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. అప్పట్లో సల్మాన్ ఖాన్ ప్రేమ పావురాలు,  ప్రేమాలయం  తెలుగులో విడుదలై సక్సెస్ అయ్యాయి. మరి దబంగ్ 3 ద్వారా సల్మాన్ తెలుగులో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాలి. ఇక వీకెండ్‌ కాబట్టి కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: