మన తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పుకుంటే, ఒకప్పటితో పోలిస్తే ప్రతి ఏడాది సినిమాల రాక బాగా పెరిగింది. దానితో పాటు నటులలో మరియు పలు ఇతర సాంకేతిక విభాగాల్లో యువతరం బాగా సందడి చేస్తోంది. దానితో పాటు టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కడంతో టెక్నీకల్ గా సినిమా ఎంతో అభివృద్ధి చెంది, మంచి క్వాలిటీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఒకప్పటి నటుల గురించి చెప్పాలంటే, అప్పట్లో నాటకాల్లో నటించిన వారు సినిమా రంగంలో ప్రవేశం చేసి, ఆపై అవకాశాలు సంపాదించి ముందుకు సాగేవారు. కానీ ఇప్పుడు నాటకాలు అనేవి లేవు, ఎప్పుడో అవి చాలావరకు కనుమరుగు అయ్యాయి. 

 

కొందరు పలు రకాల ఫిలిం ఇన్స్టిట్యూట్స్ లో శిక్షణ తీసుకుని వస్తుంటే, మరికొందరు మాత్రం సొంతంగా పలు షార్ట్ ఫిలిమ్స్ వంటి వాటిల్లో నటించడం, చిత్రీకరించడం వంటి వాటి అనుభవంతో సినిమాల్లోకి వస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లోకి ప్రవేశించడం కష్టం అని, అయితే ఒక్కసారి వచ్చాక నటుడిగా మన ప్రతిభతో ముందుకు దూసుకెళ్ళడం చాలా తేలికని, అయితే ప్రస్తుత కాలంలో మాత్రం సినిమాల్లోకి ప్రవేశించడం తేలికని, కాకపోతే నటులుగా మన ప్రతిభని నిరూపించుకుని ముందుకు సాగడం కష్టం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలానే ఒకప్పుడు మన తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి అగ్రనటుల సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ ఉండేది, 

 

అయితే ఇపుడు అలా కాదు మంచి కంటెంట్ ఉన్న సినిమా అయితే చాలు, దానిలో ఎవరు హీరో అయినా సరే సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తోంది. ఇక అన్నిటికంటే కూడా నేటి యువత ఎక్కువగా సరికొత్త ప్రయోగాలతో సినిమాలు చేసి ఆడియన్స్ ని సంతృప్తి పరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మధ్యలో కొందరు హీరోలు ఇప్పటికీ పాత పద్ధతుల్లో వెళ్తున్న వారు కూడా ఉన్నారనే చెప్పాలి. ఇక మొత్తంగా చెప్పాలంటే అప్పట్లో ఎన్ని గొప్ప సినిమాలు వచ్చాయో, నేటి కాలంలో కూడా ఇప్పటి పరిస్థితులను బట్టి కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి. కాబట్టి అప్పటి తరం మాదిరిగా ఇప్పటి తరం కూడా మంచి ఆలోచనలతో ముందుకు నడుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: