రాశీఖన్నా తన ఆరేళ్ల కెరీర్ లో... తెలుగులో 22 సినిమాలు చేసింది. అందులో నాలుగు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఊహలు గుసగులాడే.. సుప్రీమ్.. జై లవకుశ.. తొలిప్రేమ హిట్టయినా.. ఈ అమ్మడి సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. వరుసగా రెండు సక్సెస్ లతో సక్సెస్ పర్సంటేజ్ పెంచేసుకుంది.  

 

రాశీఖన్నా ఫ్లాప్ హీరోయిన్ ముద్రపడినా.. ఆఫర్స్ మాత్రం తగ్గలేదు. యంగ్ హీరోలకు మెయిన్ ఆప్షన్ గా మారింది. ఈ అమ్మడు నటించిన రెండు సినిమాలు వెంకీమామ.. ప్రతిరోజు పండుగే వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. వెంకీమామ బ్రేక్ ఈవెన్ కు దగ్గరపడితే.. ప్రతీరోజు పండుగే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. 

 

వెంకీమామ సినిమాలో రాశీఖన్నాది గుర్తుండిపోయే రోల్ కాకపోయినా.. కమర్షియల్ గా సక్సెస్ ఇచ్చింది. ఇక ప్రతి రోజుపండగలో  అయితే.. చిలిపితనంతో.. అమాయకత్వంతో కాస్త పొగరుతో ఏంజిల్ ఆర్నా పాత్రతో మెప్పించింది. ఊహలు గుసగుసలాడే.. తొలిప్రేమ మాదిరి పెర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర ఇది. 

 

తొలిప్రేమ తర్వాత సరైన హిట్ లేని రాశీఖన్నా.. వెంటవెంటనే రెండు సినిమాలతో వచ్చింది. ఫ్లాపులొచ్చిన టైమ్ లోనే వరుస ఛాన్సులు అందుకున్న రాశి.. మరిన్ని ఆఫర్స్ అందుకోవడం గ్యారెంటీ. జై లవకుశలో ఎన్టీఆర్ మినహా పెద్ద హీరోలతో జత కట్టని రాశి.. ఈ సారైనా.. స్టార్స్ నుంచి పిలుపు అందుకుంటుందేమో చూడాలి. మొత్తానికి రాశీఖన్నా.. సీనియర్ హీరోలతోనే కాదు.. యంగ్ హీరోలతో సైతం ఆడిపాడుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల కథానాయకులతో నటిస్తూ మెప్పిస్తోంది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది రాశి ఖన్నా. నటనలోనే కాదు.. డ్యాన్స్ లోనూ.. తన హావభావాలతో ప్రేక్షకుల మనసు గెల్చుకుంటోంది. ముందు ముందు కూడా మరిన్ని సినిమాల్లో నటించి హిట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకోవాలని మనమూ కోరుకుందాం.. 




 

 

మరింత సమాచారం తెలుసుకోండి: