తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కు ఛాన్సులు రావట్లేదా..? తెలుగు సినిమాలకు తెలుగు వారు పనికిరారా అంటే అవుననే అంటారు సినిమా వాళ్లు. జమున, సుమలత, సావిత్రి, కాంచనమాల, కృష్ణ కుమారి, అంజలి దేవి ఇలా వెండితెర మీద తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన ఎంతోమంది తెలుగు కథానాయికలు ఉండగా తెలుగులో మాత్రం ఇక్కడ వారికి అవకాశాలు పెద్దగా ఇవ్వరు.

 

90వ దశకంలో కూడా రంభ, రమ్యకృష్ణ, రోజా, టబు వంటి హీరోయిన్స్ తెలుగు పరిశ్రమలో చక్రం తిప్పారు. అయితే ఎంత చేసినా సరే రాను రాను టాలీవుడ్ దర్శక నిర్మార్తలు ఇతర భాషల కథానాయికల మీదే దృష్టి పెడుతున్నారు. కొద్దిగా రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలకు ముంబై నుండి మోడల్స్ దించేస్తుండగా అభినయానికి స్కోప్ ఉన్న సినిమాలకు మాత్రం కన్నడ, మళయాళ పరిశ్రమల వారి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

 

తెలుగులో తెలుగు వారికి అవకాశం ఇవ్వరా అంటే ఇస్తారు. ఒకప్పటి కన్నా మధ్యలో కొంత మార్పు రాగా మళ్లీ ఇప్పుడు మన తెలుగు వారికి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఈషా రెబ్బ, పూజిత పొన్నడ, అంజలి వంటి హీరోయిన్స్ నిలబడ్డారని చెప్పొచ్చు. అయితే తెలుగు హీరోయిన్స్ కు స్టార్ అవకాశాలు మాత్రం ఇంకా అందని ద్రాక్ష అనే చెప్పాలి. అందుకే ఒకప్పటి పరిస్థితి మళ్లీ రావాలని అంటున్నారు ప్రేక్షకులు.  

 

తెలుగు హీరోయిన్స్ కు ఛాన్స్ వచ్చిన వారు స్కిన్ షో విషయంలో వెనక్కి తగ్గుతారు. అందుకే మన దర్శక నిర్మాతలు తెలుగు హీరోయిన్స్ కు సెలెక్టెడ్ సినిమా అవకాశాలే ఇస్తారు. మరి ఇక మీదట అయినా ఆలోచన మార్చుకుని తెలుగు స్టార్స్ కూడా ఇక్కడ భామలకు అవకాశం ఇస్తారేమో చూడాలి. సరైన ఛాన్స్ వస్తే తమ సత్తా చూపిస్తాం అనుకునే తెలుగు హీరోయిన్స్ కు ఇది మంచి తరుణమని చెప్పొచ్చు.         

మరింత సమాచారం తెలుసుకోండి: