చెన్నై వేదికగా గత రాత్రి సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2019 వేడుక ఘనంగా జరిగింది. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన పలువురు వివిధ విభాగాలలో అవార్డులు గెలుచుకున్నారు. తెలుగు పరిశ్రమ నుండి రంగస్థలం మరియు మహానటి ఎక్కువ విభాగాలలో పోటీ పడ్డాయి. తెలుగులో ఈ రెండు చిత్రాలకి విపరీతమైన పోటీ నడిచింది. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్ నిలవగా, ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ నిలిచింది.

 

 


అయితే ఉత్తమ చిత్రంగా మహానటి నిలవగా, ఉత్తమ దర్శకుడి మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కి దక్కింది. అయితే ఈ జాబితాలో ఒకానొక చిత్రానికి చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్శర్య పరిచింది.
ఆ చిత్రమే కేరాఫ్ కంచరపాలెం. ప్రేమకి పరిధి లేదని చెప్తూ విభిన్నమైన కథనంతో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ సినిమాలోని నటులందరూ కొత్తవాళ్ళే. అసలు వారు అప్పటి వరకు కెమెరా మొహం కూడా చూడని వారు.

 

అలాంటి వారితో సినిమా చేసి అందరిచేత వావ్ అనిపించుకున్న దర్శకుడు వెంకటేష్ మహా..ఈ సినిమాకి అవార్డులు వస్తాయని భావించారు. అయితే వారు అనుకున్న ఆశ నిరాశే ఎదురైంది. కొన్ని నెలల క్రితం జాతీయ అవార్డుల్లోనూ దీనికి చోటు లభించలేదు. ఇప్పుడు ప్రాంతీయ అవార్డులైన ఫిల్మ్ ఫేర్ లోనూ చోటు దక్కకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఎక్కువ అవార్డులు రంగస్థలం, మహానటికి రావడం వల్ల ఈ సినిమా వేరే కేటగిరీల్లో పోటీ పడలేకపోయింది.

 

అంతర్జాతీయ వేదికల మీద పురస్కారాలందుకున్న  ఈ చిత్రానికి మన దగ్గర ప్రశంసలు దక్కినప్పటికీ పురస్కారాలు రాకపోవడం కొంత విచారకరమే. మరి ఆ లోటు త్వరలో తీరుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: