బొద్దుగా ఉండే ఛార్మి సన్న పడ్డాక సినిమాలలో అవకాశాలు తెచ్చు కుంటూ ఆమె హవా మళ్ళీ మొదలైంది. రాబోతున్న నూతన సంవత్సరం వేడుకల కోసం ఈ పంజాబీ ముద్దుగుమ్మ చార్మికి 7 నినిషాలకు రూ.18 లక్షలు ఇచ్చేందుకు చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్ సిద్ధమయిపోయింది అన్న వార్త ఛార్మికి ఇంత క్రేజ్ ఉందా అని ఆశ్చర్య పోయేటట్లుగా చేస్తోంది. ఇంతకీ ఆ 7 నిమిషాల్లో చార్మి చేసేది ఏమిటంటే చెన్నైలోని ఆ 7 నక్షత్రాల హోటల్ లో నూతన సంవత్సరాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన యువతీయువకులతో ఆమె కలిసి డాన్స్ చేస్తుందట. ఆ డాన్స్ చేసే సమయం కూడా నూతనసంవత్సరం ఘడియలు దగ్గర అయ్యే సమయంలో ఛార్మి వేదిక పైకి వచ్చి తాను డాన్స్ చేస్తూ అందరిచేత స్టెప్స్ వేయించే 7 నిమిషాల కాలవ్యవధికి రూ. 18 లక్షలు ఇచ్చేందుకు సదరు హోటల్ ఒప్పుకున్నదట. ఇంకా ఈ లిస్టులో శ్వేతాబసు కూడా క్యూలో ఉన్నా ఆమెకు 7 లక్షల రూపాయలు ఇస్తామన్నారట. అంతేకాదు చెన్నైలోని గిండి ప్రాంతంలో ఉన్న మరో నక్షత్ర హోటల్ నటి స్నేహ, లక్ష్మీరాయ్ లతో డ్యాన్స్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోందట. అంతేకాదు మరికొన్ని సిటీలో ఉన్న పేరుమోసిన నక్షత్ర హోటళ్ళు తమన్నా, కాజల్ అగర్వాల్, హన్సికల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయట. అయితే వీరు కరుణించి టైమ్ ఇస్తారా ఒకవేళ ఇచ్చినా ఎంత డిమ్యాండ్ చేస్తారు అనే విషయం పై రకరకాల ఊహగానలు వెలువడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: