టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డ్యాషింగ్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ సినిమా ఫైటర్. త్వరలో ఈ సినిమా చిత్రీకరణకు సిద్ధమవుతోంది. జనవరి లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే విజయ్ కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ను ఎంపిక చేసారు. అయితే తాజాగా సినిమాలో మరో హీరోయిన్ కూడా విజయ్ తో రోమాన్స్ చేయబోతుందని తెలుస్తోంది. దీనికోసం డైరెక్టర్ పూరి- ఛార్మీ ముంబైలో మకాం వేసి సెకెండ్ హీరోయిన్ ఎంపిక చేసే పనిలో సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. సెకండ్ హీరోయిన్ కోసం ముంబై లో జల్లెడ పడుతున్నారట. అంటే.. పూరి మరోసారి కొత్త మోడల్ ని టాలీవుడ్ కి దిగుమతి చేసే అవకాశం ఉందని దీన్ని బట్టి అర్థమవుతోంది. 

 

పూరి సీనియర్ హీరోయిన్లు కంటే కూడా కొత్త హీరోయిన్స్ పైనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటాడు. ఇప్పటివరకూ అలా ఎంతో మంది హీరోయిన్లను టాలీవుడ్ కి పరిచయం చేసి స్టార్ హీరోయిన్లను చేసాడు. ఆ నేపథ్యంలోనే ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో ఈ సినిమాని కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. మరో వైపు ఫైటర్ ని ఢీ కొట్టడానికి బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ని రంగంలోకి దింపుతున్నట్లు మరో వార్త టాలీవుడ్ సహా బాలీవుడ్ ని వెడెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో కార్తికేయ ఓ ఆసక్తికర పాత్రలో నటించనున్నారని వార్తలొచ్చాయి.

 

బాలీవుడ్ నటులు.. హిందీలో పూరికి ఉన్న ఐడెంటిటీ.. ఇంటరనేషనల్ దిగ్గజం టైసన్ బరిలో దిగడం.. ఈ తతంగం మొత్తం చూస్తుంటే .. ఇది పాన్ ఇండియా కేటగిరీలో గొప్ప ప్రయత్నమేనని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాని పూరి-ఛార్మి- కరణ్ జోహార్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. పూరి ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని వసూలు చేసింది. తాజాగా పూరి ఇమేజ్ కి- రౌడీ స్టార్ తోడవ్వడంతో ఫైటర్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: