టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీస్ లో ఒకటి ఆదిత్య 369.  ఈ మూవీ బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపిస్తాడు.  శ్రీకృష్ణ దేవరాయులు పాత్రలో నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.  సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో అనితాకృష్ణ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి  తీశారు.   బాక్ టు ఫ్యూచర్ అనే ఆంగ్ల సినిమా, ఇంకా హెచ్.జి.వెల్స్ టైం మెషీన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన మూవీ.  మొదట్లో సుమారు 1 కోటి 30 లక్షలు అవుతుందనుకున్న బడ్జెట్ తర్వాత మరో 30 లక్షలు అదనంగా అయింది.ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే ఆరోహణా క్రమంలోని అంకెలు చేర్చారు.

 

జులై 18, 1991 న విడుదలైన ఈ  సినిమా భారీ విజయం అందుకుంది. అయితే ఈ మూవీ సీక్వెల్ అప్పట్లో అనుకున్నప్పటికీ సరైన కథ లేకపోవడం ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. తన జనరేషన్‌ హీరోలు ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేస్తుంటే బాలయ్య మాత్రం కమర్షియల్ ఫార్మా్‌ట్‌ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దారుణమైన టాక్‌ వచ్చింది. కథా కథనాలతో పాటు లుక్‌ విషయంలోనూ బాలయ్య నిరాశపరచటంతో అభిమానులు కూడా జీర్జించుకోలేకపోతున్నారు.  

 

ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ తో భారీ డిజాస్టర్ పొందిన బాలయ్య ‘రూలర్ ’తో మరో నిరాశ పొందారు.  తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి బాలకృష్ణ స్పందించారు. ‘ఆదిత్య 369’కి సీక్వెల్ చేయాలనీ నాకూ వుంది. ఒకరోజు రాత్రి అనుకోకుండా ఈ సీక్వెల్ కి సంబంధించిన కథ ఏమిటనేది తట్టింది. ఆ కథకు కార్యరూపాన్ని ఇవ్వవలసి వుంది. అయితే ఆ కథ ఏంటీ.. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఇలా విభిన్న తరహాలో కొత్త హంగులతో ఉండబోతుందా అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: