లెక్కల మాస్టారు సుకుమార్ తీవ్ర నిరాశలో ఉన్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ మొదలైంది. అందుకు బలమైన కారణమే ఉంది. గత సంవత్సరం ఆయన దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద కమర్షియల్ సక్సస్ ని అందుకుందో అందరికి తెలిసిందే. నాన్నకు ప్రేమతో వంటి పక్కా క్లాస్ సినిమా ని తీసి హిట్ కొట్టిన సుక్కు ఆ సినిమాకి పూర్తి భిన్నంగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ధృవ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రంగస్థలం సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరిని విపరీతంగా ఆకర్షించింది. అంతేకాదు మెగా ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ తర్వాత ఇలాంటి ఒక స్వచ్చమైన కథని వెండితెర మీద చూస్తున్నందుకు అభిమానులు బాగా ఆకర్షితులైయ్యారు. 

 

ఇక మెగాస్టార్ తో పాటు పలువురు సినీ తారలు, ఇతర టెక్నీషియన్స్ చరణ్ పర్‌ఫార్‌మెన్స్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. చెవిటివాడిగా చరణ్ అద్భుతమైన నటన ఎప్పటికి మర్చిపోలేరన్న మాట వాస్తవం. అయితే ఈ సినిమాని తెరకెక్కించిన సుకుమార్ బాగా డిసప్పాయింట్ మెంట్ తో ఉన్నాడు. ఎందుకంటే తాజాగా రంగస్థలం సినిమాకి ప్రకటించిన ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ పేరు లేకపోవడం. మహానటిని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ కి ఉత్తమ దర్శకుడిగా అవార్డుని ప్రకటించారు. అలాగే మహానటిగా నటించిన కీర్తి సురేష్ కి ఉత్తమనటిగా అవార్డ్ ని ప్రకటించారు. 

 

అలాగే రంగస్థలం సినిమాకి ఉత్తమ నటుడిగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ కి అవార్డ్ ని ప్రకటించారు. ఉత్తమ సహాయ నటి - అససూయ భరద్వాజ్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (రంగస్థలం) .. ఉత్తమ మ్యూజిక్ అల్బమ్ - దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం).. ఉత్తమ గేయ రచయిత - చంద్రబోస్(ఎంత సక్కగున్నావే- రంగస్థలం)..లకు అవార్డులను ప్రకటించారు. కానీ అసలు దర్శకుడినే వదిలేశారు. ఇలా ఎందుకు జరిగిందోనని ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: