గత కొన్నాళ్లుగా తెలుగు సినిమా పయనిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే బాహుబలి వంటి అత్యద్భుత సినిమా తరువాత టాలీవు సినిమా కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు పలువురు ఇతర భాషల ప్రేక్షకులు మరియు నటులు మన టాలీవుడ్ వైపు చూడడం జరిగింది. ఇక ఆ తరువాత ఇటీవల వచ్చిన మెగాస్టార్ సైరా, ప్రభాస్ సాహో సినిమాలు పెద్దగా సక్సెస్ కానప్పటికీ మంచి పేరును మాత్రం దక్కించుకున్నాయి. ఇక వీటి సంగతి అటుంచితే, ఈ కొద్దిపాటి సినిమాలతో ఇతర భాషల దృష్టిని ఆకరిస్తుంచినప్పటికీ కూడా, ఇప్పటికీ కొన్ని సినిమాలు మరియు కొందరు నటులు పాత రొట్ట రొటీన్ కథలను మాత్రం వదలడం లేదు. 

 

కొద్దిరోజలుగా టాలీవుడ్ లో కొందరు నటులతో పాటు దర్శకులు ఇప్పటికీ కూడా మూస కథ, కథనాలను అనుసరించి సినిమాలు తీస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే, అటువంటి పాత కథలను సదరు హీరోలు మరియు దర్శక, నిర్మాతలు వాటినే నమ్ముకుని, వాటిని ఏ మాత్రం ప్రేక్షకనాడిని పెట్టుకునేలా తెరకెక్కించలేక కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారని అంటున్నారు. ఇక అటువంటి సినిమాలు ఆడకపోగా, ఆయా హీరోలను నమ్ముకుని వాటిని కొనుక్కుంటున్న బయ్యర్లు కూడా భారీ నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎక్కువగా ఆ విధంగా పాత పంధా కథలను నమ్ముకుని కొందరు సీనియర్ హీరోలు ముందుకు నడుస్తుంటే, ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న యువ హీరోలు మాత్రం ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్లు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా వైవిధ్యమైన కథా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

 

మరోవైపు కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్, భాషల వారు పలు రకాల ట్రెండీ సినిమాలతో ముందుకు పోతున్నారని, నిజానికి బాలీవుడ్ తరువాత అతి పెద్దదైన మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు మూస కథల బాట పడుతూ ఫ్లాప్స్ అందుకుంటున్నారని, కావున ఇకనైనా ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనకు తగ్గట్లు ఆ దర్శకులు, కథకులు కొంత విభిన్న కథలతో ముందుకు వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరించడంతో పాటు భవిష్యత్తులో మన టాలీవుడ్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: