ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఒక సినిమా కథ విషయంలో అతడు తీసుకునే జడ్జిమెంట్ సామాన్యంగా గురితప్పదు. నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ద్విపాత్రాభినయం చేస్తూ ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురిలో ఒకరిగా గుర్తింపు పొందిన దిల్ రాజ్ రోజుకు 18 గంటలు పనిచేస్తాడు అని అంటారు. 

అతడు తీసే సినిమాలకు దర్శకత్వం వహించాలని కథలు రాయాలని ఎందరో తాపత్రయపడుతూ దిల్ రాజ్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ కు సంబంధించిన ఒక గంట పోలసీ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. దిల్ రాజ్ కు కథ చెప్పాలని వచ్చే యంగ్ రైటర్స్ నుండి సీనియర్ రైటర్స్ వరకు ఎవరు తన దగ్గరకు వచ్చినా తనకు కత చెప్పే విషయంలో దిల్ రాజ్ ముందుగా ఆ కథ వినడానికి ఒక గంట సమయం ఇస్తాడట.

ఆ గంటలో ఆ రచయిత లేదా దర్శకుడు చెప్పే కథ తనకు నచ్చితే వెంటనే కొంత మొత్తం అడ్వాన్స్ ఇచ్చి కథను స్క్రిప్ట్ గా డెవలప్ చేయమని చెపుతాడట. అలా డెవలప్ చేసిన స్క్రిప్ట్ దిల్ రాజ్ కు నచ్చితే తన బ్యానర్ లో ఆ కథను తీసే అవకాశం ఆ రచయిత లేదా దర్శకుడుకు ఇస్తాడని లేదంటే తాను ఇచ్చిన ఆ అడ్వాన్స్ మొత్తాన్ని వదులు కుంటాడనీ దిల్ రాజ్ సన్నిహితులు అంటూ ఉంటారు. 

దీనితో దిల్ రాజ్ కు కథలు చెప్పడానికి చిన్న రచయితల నుండి పెద్ద రచయితల వరకు ఆసక్తి కనపరుస్తారని ప్రతిరోజు కొన్ని గంటలు కథలు వినడానికే దిల్ రాజ్ సమయం కేటాయిస్తాడు కాబట్టి దిల్ రాజ్ సినిమాలకు సక్సస్ రేటు ఎక్కువ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక భారీ ఒక భారీ నిర్మాత సంక్రాంతి సీజన్ కు ఒక భారీ సినిమాను మాత్రమే తీయగలడు. అయితే రాబోతున్న సంక్రాంతి సీజన్ కు విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ కు సహ నిర్మాతగా ‘అల వైకుంఠపురములో’ ‘దర్బార్’ మూవీలకు బయ్యర్ గా ఈ సంక్రాంతి సీజన్ అంత దిల్ రాజ్ ఆధిపత్యంలోనే నడుస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: