అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయిల గారాల కూతురు ఆరాధ్య బచ్చన్ పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టింది. ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్న ఆరాధ్య బచ్చన్ స్టార్ కిడ్స్ ప్రోగ్రాంలో భాగంగా ముద్దుముద్దుగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. ఆరాధ్య మాట్లాడిన వీడియోను అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి 'తన మాటలకు గర్వంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు. 

 

ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవంలో ఆరాధ్య బచ్చన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు చీర ధరించి ఆరాధ్య ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ఆరాధ్య తల్లి ఐశ్వర్య రాయ్ బచ్చన్, తండ్రి అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. మహిళల గొప్పతనం, సాధికారత గురించి ఆరాధ్య బచ్చన్ మాట్లాడింది. ఈ కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయి లతో పాటుగా మిగతా సెలెబ్రిటీలు షారుక్ ఖాన్, కరిష్మా కపూర్, లారా దత్తా మొదలైనవారు పాల్గొన్నారు.

 

బిగ్ బి అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేక పోయారు. తను ప్రస్తుతం నటిస్తున్న నాగరాజ్ మంజులే చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల అమితాబ్ ఈ కార్యక్రమానికి హాజరు అవ్వలేదు. ధీరుభాయి ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్రత్యేకంగా అమితాబ్ కోసం వీడియో స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు దీని ద్వారా అమితాబ్ ఆరాధ్య ముద్దుముద్దు మాటలను విన్నారు. 

 

అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్యారాయ్ ఇద్దరూ 2007 వ సంవత్సరం ఏప్రిల్ 20 న వివాహం చేసుకున్నారు. వారికి వివాహం అయిన నాలుగు ఏళ్ళ తరువాత అనగా 2011వ సంవత్సరంలో ఆరాధ్య బచ్చన్ కు జన్మనిచ్చారు ఐశ్వర్యరాయి బచ్చన్. అప్పటి నుంచి తమ గారాల పట్టిని ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు అభిషేక్ దంపతులు.

 

https://mobile.twitter.com/SrBachchan/status/1208652876693655553

మరింత సమాచారం తెలుసుకోండి: