విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన వెంకీ మామా చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంది. గత వారం విడుదలైన వెంకీమామా ఈ వారం రిలీజైన చిత్రాలతో పోటీ పడుతూ ముందుకు వెళ్తుంది. రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు రీల్ లైఫ్ లో మామా అల్లుళ్ళుగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. టాలీవుడ్ సూపర్ స్టార్లయిన మహేష్ బాబు, చిరంజీవి సైతం ఈ సినిమా గురించి పొగిడారు.

 

 

అయితే వెంకీ మామా చిత్రం తర్వాత వెంకటేష్ అసురన్ అనే రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ సాధించిన అసురన్ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మంచి ధరకి కొనుక్కుని వెంకటేష్ తో రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ధనుష్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ లుక్ కి సంబంధించి విమర్శకుల నుండు మంచి ప్రశంసలు దక్కాయి.

 


అయితే తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రానికి మేకప్ కోసం వెంకటేష్ కి లుక్ టెస్ట్ చేయించారట. వెంకీ కూడా ఇటీవలే ముంబై వెళ్లి లుక్ టెస్ట్ చేయించుకున్నారు. చిత్ర బృందం సమాచారం మేరకు కథానాయకుడి పాత్ర కోసం వెంకీ ట్రై చేసిన లుక్ చాలా బాగా వచ్చిందని, చిన్న చిన్న మార్పులతో దాన్నే ఫైనల్ చేశారని, ఆ లుక్లో వెంకీ చాలా కొత్తగా కనిపిస్తారని చెప్పుకొచ్చారు. తమిళంలో తమిళ నెటివిటీకి సంబంధించి ధనుష్ లుక్ ఎలా ఉంటుందో తెలుగులోనూ తెలుగు నెటివిటీకి తగిన విధంగా వెంకటేష్ లుక్ ఉంటుందట. ఈ లుక్ తెలుగు ప్రేక్షకులకి నచ్చేలా ఉంటుందట

 

 

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రియ కథానాయికగా నటిస్తుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: