‘రంగస్థలం’ మూవీకి ఫిలిం ఫెయిర్ అవార్డులలో గుర్తింపు రావడమే కాకుండా ఈ మూవీలో నటించిన చరణ్ కు అనసూయకు సంగీతాన్ని ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ కు ఫోటోగ్రాఫీ అందించిన రత్నవేలుకు అందరికీ అవార్డులు వచ్చినా ఈమూవీ సృష్టికర్త సుకుమార్ కు మాత్రం ఉత్తమ దర్శకుడు అవార్డు రాకపోవడం అతడి అభిమానులను బాధ పెట్టింది. ఈ ఫీలింగ్స్ చరణ్ దృష్టి వరకు రావడంతో చరణ్ తెలివిగా ఒక చిన్న పని చేసి సుకుమార్ అభిమానులకు జోష్ ను కలిగించాడు. 

‘రంగస్థలం’ మూవీలోని చిట్టిబాబు పాత్ర తనకు వస్తుందని తన కలలో కూడ ఊహించలేదు అని అభిప్రాయపడుతూ ఈ పాత్ర వల్ల తనకు వచ్చిన పేరు గౌరవం అవార్డులు అన్నీ సుకుమార్ కే చెందుతాయి అంటూ తన అవార్డును సుకుమార్ కు అంకితం ఇచ్చాడు చరణ్. ఇప్పుడు చరణ్ చేసిన తెలివైన పనికి సుకుమార్ అభిమానులు ఆనంద పడుతూ చరణ్ కు అభినందనలు తెలియచేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా చరణ్ తన ఫిలిం ఫెయిర్ అవార్డును అందుకోవడానికి చెన్నై వెళ్ళలేకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసాడు. తనకు కొద్ది రోజులుగా హైదరాబాద్ లో వస్తున్న వాతావరణంలోని మార్పులు వల్ల తనకు ఫంగస్ వచ్చిందని దీనికితోడు జ్వరం కూడ వస్తున్న నేపధ్యంలో తాను ఫిలిం ఫెయిర్ అవార్డు ఫంక్షన్ కు వెళ్ళలేకపోవడానికి గల కారణం వివరించాడు. 

వాస్తవానికి చిట్టిబాబు లాంటి పాత్ర ఒక నటుడుకి చాల అరుదుగా వచ్చే అవకాశం. ఈ పాత్రలో చరణ్ బాగా రాణించడంతో చరణ్ కు నేషనల్ అవార్డు వస్తుందని భావించారు. ఆ అవార్డు జస్ట్ ఒక ఓటు తేడాతో చరణ్ కు మిస్ అయింది. ఈ సంఘటనతో చరణ్ అభిమానులు అప్పట్లో నిరాశ చెందారు. అయితే ఫిలిం ఫెయిర్ అవార్డు వచ్చినా ఆ అవార్డును కూడ అందుకోలేకపోవడం యాధృశ్చికం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: