లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కాజల్ పది సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మొదటి సినిమా ఫలితం నిరాశ కలిగించినా, ఆ తర్వాత వచ్చిన చందమామ సినిమాతో తనకి చాలా గుర్తింపు వచ్చింది. అయితే మగధీర సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు బిజీ అయిపోయింది.

 

అయితే ప్రస్తుతం కాజల్ సినిమాలు చేస్తున్నప్పటికీ, విజయాలు మాత్రం తక్కువనే చెప్పాలి. నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఆమెకి సరైన హిట్ లేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన "సీత" సినిమాలో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ, సినిమా మాత్రం అంతగా ఆడలేదు. అదీ గాక బాలీవుడ్ లో విజయం సాధించిన క్వీన్ సినిమా రీమేక్ లో నటించినప్పటికీ, ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకపోవడం గమనార్హం.

 

అయితే వాటి గురించి ఆలోచించకుండా కాజల్ ప్రస్తుతం ప్రశాంతంగా హాలిడేని ఎంజాయ్ చేస్తుంది.  సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులని పలకరిస్తూనే ఉంది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియా అభిమానులకి కనువిందు కలిగించింది. తన సోదరి నిషా అగర్వాల్ తో కలిసి మాల్దీవుల విహారానికి వెళ్లిన కాజల్ అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. 

 

 

అక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ స్విమ్ సూట్ లో తన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులకి ఆనందాన్ని పంచుతుంది. ఇంతకుముందు ఎన్నడూ చూడని అందాలని చూపిస్తూ కవ్విస్తుంది. చారల బికినీలో దిగిన ఫోటోలను షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. తన సోదరి నిషా అగర్వాల్ కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకి దూరంగా ఉండి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: