ఆర్ ఎక్స్ 100 సినిమాతో హిట్ సొంతం చేసుకున్న హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత వచ్చిన ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాతో చతికిల పడింది. ఆర్ ఎక్స్ 100 లో లిప్ లాకులతో హాటుగా కనిపించిన ఈ భామకి ఆ సినిమా తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే అవకాశాలు వస్తున్న క్రమంలో వాటిని ఎలా వాడుకోవాలో తెలియక సతమతమై ఆర్ డి ఎక్స్ లవ్ లాంటి బీ గ్రేడ్ సినిమాల్లో నటించి తనని తాను డీగ్రేడ్ చేసుకుంది.

 


ఆర్ ఎక్స్ 100 తర్వాత ఆమె మూడు సినిమాలు ఒప్పుకుంది. అందులో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి వెంకీ మామ, మరోటి డిస్కోరాజా.. ఈ రెండు పెద్ద సినిమాలు ఆర్ ఎక్స్ 100 లో ఆమె నటన చూసి వచ్చినవే. అందులో బోల్డ్ క్యారెక్టర్ చేసినప్పటికీ కథాపరంగా అదే కరెక్ట్ కాబట్టి అది శృతిమించినట్లుగా అనిపించలేదు. కానీ ఆమె ఒప్పుకున్న ఆర్ డి ఎక్స్ లవ్ మాత్రం శృతి మించిపోయింది.

 


బీ గ్రేడ్ సినిమా లాంటి క్వాలిటీతో వచ్చిన ఆ చిత్రం పాయల్ పాపులారిటీని దిగజార్చిందనే చెప్పాలి. ఆ సినిమా కేవలం పాయల్ గ్లామర్ ని దృష్టిలో పెట్టుకునే తీసినట్టు కనిపించింది. కేవలం కనులకి ఆనందం కలిగించే సినిమా తీసి తనని తాను గోతిలోకి పడేసుకుంది. అయితే ఇప్పుడిప్పుడే పాయల్ ఆ పరిస్థితి నుండి కోలుకుంటుంది. దానికి కారణం వెంకీ మామ సక్సెస్సే. వెంకీ మామ సినిమాలో వెంకటేష్ కి జోడోగా కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.

 

ఆ సినిమాలో ఆమె కనిపించింది కొద్ది సేపైనా చాలా బాగా చేసిందని వార్తలు వచ్చాయి. అయితే వెంకీ మామ సక్సెస్ తనలొ ఉత్సాహం నింపిందట. ఇకనుండి ఆమె కథల విషయంలో జాగ్రత్తగా ఉండి మళ్లీ ఆర్ డి ఎక్స్ లాంటి సినిమాలు చేయబోనని అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: