నందమూరి నటసింహం బాలకృష్ణ , ఓ  యువ హీరోతో పోటీపడ్డాడు. అదేదో   డాన్స్ లోనో ఫిట్ నెస్ లోనూకాదు  డిజాస్టర్లు కొట్టడం  లో...  ఆర్ ఎక్స్ తో సెన్సేషనల్ హిట్  కొట్టి సినిమాల్లోకి  గ్రాండ్  గా  ఎంట్రీ ఇచ్చాడు యువ హీరో  కార్తికేయ.  ఇక ఈ సినిమా  తరువాత  ఈ హీరో ఈ ఏడాది  హిప్పీ ,గుణ 369, 90ఏంఎల్ లతో  ప్రేక్షకులముందుకు వచ్చి హ్యాట్రిక్ డిజాస్టర్లను  చవిచూశాడు.  అయితే  అనుభవం లేని  హీరో కాబట్టి కార్తికేయ   కథల  ఎంపికలో  పొరపాట్లు చేశాడనుకోవచ్చు కానీ  30ఏళ్లకు  పైగా  అనుభవం ఉండి అగ్ర హీరోగా  కొనసాగుతున్న  బాలకృష్ణ  కూడా  ఇలాంటి  పొరపాట్లే  చేయడం  అభిమానులకు మింగుడుపడడం లేదు.  ఈఏడాది మొదటగా సంక్రాంతికి  బాలకృష్ణ , ఎన్టీఆర్  కథానాయకుడు తో  ప్రేక్షకులముందుకు వచ్చాడు.   తన  తండ్రి  ఎన్టీఆర్  బయోపిక్ లో  భాగంగా  వస్తున్న మొదటి  భాగం కావడంతో   సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రివ్యూస్ కూడా బాగానే వచ్చాయి కానీ విపరిమితమైన  నెగిటివ్ టాక్ రావడంతో   డిజాస్టర్ ఫలితాన్ని  చవిచూసింది.  దాంతో బయ్యర్లు  భారీగా  నష్టపోయారు.   ఇక  రెండవ భాగం   మహానాయకుడు అయితే  కథానాయకుడు  కంటే  దారుణమైన ఫలితాన్ని రాబట్టింది.  మొదటి భాగంకు  ఓపెనింగ్స్ అయినా వచ్చాయి కానీ  మహానాయకుడు కి  పబ్లిసిటీ  ఖర్చులు  కూడా రాలేదు. అలా తన తండ్రి  బయోపిక్ ను తీసి బాలయ్య దారుణంగా  బంగపడాడ్డు.  

 
ఈ సినిమాలు ఇచ్చిన షాక్ తో  బాలకృష్ణ  కొన్ని నెలలు  గ్యాప్ ఇచ్చి తనకు జై సింహ  లాంటి  డీసెంట్ హిట్ ఇచ్చిన  తమిళ సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ తో  రూలర్ అనే చిత్రాన్ని చేశాడు.   ఎలాంటి అంచనాలు లేకుండా  గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం  డిజాస్టర్ టాక్  తో  మూడురోజులో కేవలం  6కోట్ల  షేర్ ను మాత్రమే రాబట్టి మహానాయకుడు  సరసన  నిలిచింది. అలా ఈ ఏడాది..   బాలయ్యకు చేదు  జ్ఞాపకంగా మిగిలిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: