మొన్న ఫిల్మ్ ఫేర్ అవార్డుల పండగ జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డ్ ఫంక్షన్ చెన్నైలో జరిగింది. అయితే తెలుగులో రంగస్థలం, మహానటి చిత్రాలకి పలు విభాగాల్లో అవార్డులు వరించాయి. రంగస్థలం సినిమాకి బెస్ట్ యాక్టర్ గా రామ్ చరణ్ కి రాగా, బెస్ట్ సపోర్టింగ్ ఆక్ట్రెస్ గా అనసూయ అవార్డు అందుకుంది. అలాగే బెస్ట్ లిరిక్స్ రాసిన చంద్రబోస్ కి ఎంత సక్కగున్నావే పాటకి గాను అవార్డు వచ్చింది.

 

కెమెరామెన్ రత్నవేలుకి బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కింది. అయితే బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్న రామ్ చరణ్ కి ఈ ఈవెంట్ కి రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ అవార్డుని అందుకోవడానికి అల్లు అరవింద్ వచ్చాడు. హైదారాబాద్ లోనే ఉన్న రామ్ చరణ్ చెన్నై వరకు ఎందుకు వెళ్లలేకపోయాడని అందరూ ఆలోచించారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ప్రకారం రామ్ చరణ్ సైనసైటిస్ తో బాధపడుతున్నాడని, అలాగే హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల అది మరింత పెరిగిందని, అందువల్ల చెన్నై ఫ్లైట్ మిస్ అయిందని తెలిపారు.

 

చిట్టి బాబు క్యారెక్టర్ కి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, ఆ క్యారెక్టర్ ఇంతలా విజయం అందుకుంటుందని అనుకోలేదని, దర్శకుడు సుకుమార్ కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే తనకి జీవితంలో గుర్తుండిపోయే పాత్ర ఇచ్చిన సుకుమార్ గారికి ఈ అవార్డుని అంకింతం ఇస్తున్నట్లు ప్రకటించాడు. చెన్నైకి రాలేకపోయినందుకు బాధగా ఉందని, అయినా అవార్దు రావడం తనలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని తెలిపాడు.

 

రంగస్థలం సినిమా ౨౦౧౮ లో విడుదలై తెలుగులో నాన్ బాహుబలి రికార్డులని సొంతం చేసుకుంది. రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: