వరస పరాజయాలతో సతమతమైపోతున్న సందీప్ కిషన్ కొన్ని వారాల క్రితం విడుదలైన తన మూవీ ‘తెనాలి రామకృష్ణ’ ను తెనాలిలో అదేవిధంగా కర్నూలులో ఆ మూవీ విడుదలకు ఒకరోజు ముందు ఆ ఊరులోని కొన్ని ధియేటర్స్ లో పబ్లిసిటీ కోసం ఉచితంగా ప్రదర్శించి ఆ మూవీకి పాజిటివ్ టాక్ తెప్పించి ఏదోఒక విధంగా నిలబెట్టాలని అనేక ప్రయత్నాలు చేసాడు. 

అయితే ఆ ప్రయోగం ఘోరంగా విఫలం కావడమే కాకుండా ఆ మూవీ చాల చోట్ల రెండవ వారంతోనే లేచిపోయింది. ఇప్పుడు ఫెయిల్యూర్ హీరోగా సతమతమైపోతున్న రాజ్ తరుణ్ కూడ సందీప్ కిషన్ సెంటిమెంట్ ను ఆదర్శంగా తీసుకోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

ప్రస్తుతం రాజ్ తరుణ్ కు ఏమాత్రం క్రేజ్ లేకపోవడంతో క్రిస్మస్ కు విడుదల కాబోతున్న అతడి లేటెస్ట్ మూవీ ‘ఇద్దరి లోకం ఒకటే’ మూవీని ఏకంగా గత ఐదు రోజుల నుంచి రాష్ట్రంలోని అనేక కాలేజీలకు చెందిన విద్యార్దులకు రిలీజ్ కు ముందే ఉచితంగా చూపెడుతూ ఆ మూవీకి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చేల దిల్ రాజ్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.  

ఇప్పటికే ఈ సినిమాను హైదరాబాద్ లోని ఒక కాలేజీ విద్యార్థులకు చూపించారు. ఈరోజు నెల్లూరులోని మరొక కాలేజీ స్టూడెంట్స్ కు ఉచితంగా చూపిస్తారని తెలుస్తోంది. రేపు విశాఖపట్నంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధలకు కూడ ఇలాగే ఉచితంగా చూపిస్తారట. ఈ ప్రయత్నాలు చూస్తుంటే రాజ్ తరుణ్ సినిమాలకు క్రేజ్ లేకపోవడంతో ఎదో విధంగా యూత్ ను ఆకట్టుకుని ధియేటర్ల దగ్గరకు రప్పించుకోవడానికి దిల్ రాజ్ ఇలాంటి వ్యూహాన్ని ప్రయోగిస్తున్నాడా అని అనిపించడం సహజం. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో నటించిన షాలినీ పాండే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కూడ రాజ్ తరుణ్ కు హిట్ ను ఇవ్వలేకపోతే రాజ్ తరుణ్ కెరియర్ చాల గందరగోళంలో పడిపోతుంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: