భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ అమితాబచ్చన్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్.  అమితాబ్ హరివంశ్ బచ్చన్ 1942 అక్టోబర్ 11 న ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ నగరంలో జన్మించారు.  అమితాబ్ 1969లో భువన్ షోం అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.  ఆ తర్వాత ఆనంద్ (1971) లో రాజేష్ ఖన్నాతో కలసి చేసిన అమితాబ్ ఆ సినిమాలో వైద్యునిగా నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకుగానూ ఉత్తమ సహాయనటునిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. పర్వానా,  రేష్మా ఔర్ షేరా మూవీస్ లో విలన్ గా నటించారు.  బాంబే టు గోవా సినిమాలో హీరోగా ఆయన నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జంజిర్ (1973) లో విజయ్ ఖన్నా పాత్రలో యాంగ్రీ యంగ్ మాన్ ఆఫ్ ఇండియాగా కొత్త వొరవడి తీసుకు వచ్చారు.  

 

మూవీ అత్యధిక కలెక్షన్లు వసూలు చేయడమే కాదు... అమితాబ్ ను స్టార్ ని చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జైత్ర యాత్ర కొనసాగుతూనూ ఉంది. ఈ మద్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’మూవీలో గోసాయి వెంకన్నగా నటించారు.  తాజాగా భారతీయ చలనచరిత్రకు మూలపురుషుడు అయిన దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో ఇచ్చే ఈ అవార్డు ఈ ఏడాది అమితాబ్ బచ్చన్‌ కైవసం చేసుకోనున్నారు.ఫాల్కే పేరుపైన అవార్డును అందించడాన్ని 1969లో మొదలు పెట్టారు. భార‌తీయ సినీరంగంలో ఇచ్చే అవార్డులలో దీన్నే అతిపెద్ద అవార్డుగా పరిగణలోకి తీసుకుంటారు. కానీ, ఈ ఈవెంట్‌కు ఒక్కరోజు ముందు.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది... ఈ కార్యక్రమానికి తాను రాలేకపోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా బిగ్‌ బీ చెప్పుకొచ్చారు.

 

"జ్వరం కారణంగా డాక్టర్స్ ప్రయాణానికి అనుమతించలేదని.. దాంతో ఢిల్లీలో జరిగే జాతీయ పురస్కారానికి హాజరు కాలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు బిగ్‌బీ. అమితాబ్ కొన్ని వారాల క్రితం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.. రెగ్యులర్ చెకప్స్ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆయనను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వైద్యులు.  ఈ నేపథ్యంలో ల్లీలో జరిగే జాతీయ పురస్కారానికి హాజరు కాలేకపోతున్నానంటూ ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించినా.. ఆయన ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడమే అనుకుంటున్నారు అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: