జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా అలరించిన నాగబాబు ఇప్పుడు జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీ తెలుగులో ఇప్పటికే ఎన్నో కామెడీ కార్యక్రమాలు వచ్చాయి. జీ కామెడీ షో, జీ కామెడీ క్లబ్‌,ఫ్యామిలీ సర్కస్‌, కామెడీ కిలాడీలు కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు నవ్వుల నైట్స్‌ పేరుతో ప్రతీ శనివారం, ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మిమ్మల్ని నాన్‌స్టాప్‌గా నవ్వించేందుకు సిద్ధమైంది జీ తెలుగు. ఇప్పటికే లోకల్‌ గ్యాంగ్స్‌ అనే కార్యక్రమాన్ని అందిస్తున్న జీ తెలుగు ఇప్పుడు అదిరింది అనే అదిరిపోయే కార్యక్రమాన్ని సిద్ధం చేసింది.

 

ఈ షోలో నాగబాబుతో పాటు నిహారిక జడ్జ్‌గా వ్యవహరించింది. ఇక ప్రోగ్రామ్‌కు అనసూయ కాకుండా.. సమీరా యాంకరింగ్ చేస్తోంది. తాజాగా ఈ ఆదివారం ఎంతో అట్టహసంగా ప్రారంభమైన షోలు జబర్దస్త్ కమెడియన్స్ తనదైన కామెడీతో మైమరిపించారు. మొత్తంగా ‘అదిరింది’ షో చూస్తుంటే.. జబర్దస్త్ షోకు సీక్వెల్‌ల కనపడింది. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు జబర్ధస్త్ షోలో కమెడియన్స్ గతంలో చేసిన స్కిట్సే మరలా ఈ కొత్త షో లో చేసి చూపించారు. మ‌రి నాగబాబు ‘అదిరింది’ ప్రోగ్రామ్ ఏ మేరకు టీఆర్పీ సాధిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

 

అయితే మ‌రోవైపు నాగ‌బాబు అందిరింది ప్రోగామ్‌ను ఎలా అయిన హిట్ చేయాల‌ని త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. అందులో జబర్దస్త్ లాంటి పాపులర్ షో నడుస్తూనే ఉంటుందని, అలా అని ప్రేక్షకులు కొత్త కామెడీ షో చూడరనుకోవడానికి లేదన్నారు. అదిరింది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని,ఈ షోతో అందరి మనసుల్ని గెలుచుకుంటామని అన్నారు. మ‌రి ఈ అదిరింది షో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: