కొంతమంది హీరోయిన్స్ కి ఎలాంటి సినిమాలు స్టార్ ఇమేజ్ ని తీసుకు వస్తాయో వాళ్ళే కాదు ఎవరూ ఊహించలేరు. స్కిన్ షో చేయాలనుకున్న వాళ్ళ్కి అది బెడిసికొడుతుంది. పద్దతిగా సినిమాలు చేస్తున్న వాళ్ళకి ఇది తీవ్ర నిరాశను మిగులుస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సక్సస్ ఫుల్ హీరోయిన్ పరిస్థితి ఇలానే ఉంది. డెబ్యూ సినిమాతోనే హిట్ సాధించాలంటే ఎంతో లక్కు ఉండాలి. అలాంటి లక్కు ఉంది కాబట్టే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తన మొదటి సినిమా 'ఆర్.ఎక్స్100' తోనే సూపర్ హిట్ సాధించింది. బోల్డ్ యాక్టింగ్ తో లిప్పు లాక్స్.. గ్లామర్ షో చేసేసి యూత్ కు దగ్గరయింది. దీంతో ఆ తర్వాత కూడా అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అలా వచ్చిన అవకాశాలలో 'ఆర్.డి.ఎక్స్ లవ్' ఒకటి. అయితే ఆ సినిమాతో పాయల్ ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది. ఆర్.ఎక్స్100 మాదిరిగా ఫుల్ స్కిన్ షో, లిప్ లాక్స్ ఇచ్చినా ఎందుకనో ఆ సినిమా పాయల్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎందుకనో పాయల్ ని జనాలు అలా చూడలేకపోయారు. 

 

అంతేకాదు తను నటించిన ఐటం సాంగ్ కూడా అంతగా ఎవరికీ నచ్చలేదు. అయితే ఈసారి అలాంటి పొరపాట్లు చెయ్యకూడదని పాయల్ గట్టిగా నిర్ణయించుకుందని తాజా సమాచారం. అలా నిర్ణయించుకోవడానికి 'వెంకీమామ' సక్ససే కారణమని తెలుస్తోంది. డిసెంబర్ 13 న విడుదలైన 'వెంకీమామ' బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇప్పటికీ వసూళ్లు రాబడుతూ 'వెంకీమామ' టీమ్ ను సంతోషపెట్టింది.  వెంకటేష్ - నాగచైతన్యలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో పాయల్ సీనియర్ హీరో వెంకీకి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. సీనియర్ స్టార్ తో జోడీ కట్టినప్పటికీ సినిమా విజయం సాధించడం పాయల్ కు కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిందట. 

 

'వెంకీమామ' విజయం తర్వాత పాయల్ కు కొత్త ఆఫర్లు వస్తున్నాయట. ప్రేక్షకులకు కూడా తో పాయల్ కి బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఇక 'ఆర్.డి.ఎక్స్ లవ్' లాంటి బీ గ్రేడ్ సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయిందట. పెద్ద హీరోల సినిమాలు.. లేకపోతే నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేయాలని అనుకుంటోందట. మరి ఈ కొత్త నిర్ణయం పాయల్ కెరీర్ కు ఎంతవరకు మేలు చేస్తుందో ఏమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఇదిలా ఉంటే పాయల్ ప్రస్తుతం రవితేజ సినిమా 'డిస్కోరాజా' లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా తమిళంలో 'ఏంజెల్' అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే పాయల్ కొంతకాలం ఇండస్ట్రీలో కంటిన్యూ అవడం గ్యారెంటి. 

మరింత సమాచారం తెలుసుకోండి: