తెలుగు లో రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజ’, ‘నేను లోకల్’ మూవీస్ మంచి విజయాలు అందుకున్న కీర్తి సురేష్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ‘మహానటి’ మూవీలో సావిత్ర పాత్రలో నటించింది.  నిజంగా తెరపై మళ్లీ సావిత్రి వచ్చి నటించిందా అన్నంతగా తన హావభావాలు, డైలాగ్స్, అమాయకత్వంతో మెప్పించింది.  విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.  సావిత్రి జీవితంలో ఎలా ఉన్న స్థాయికి వచ్చింది.. ఎంత గొప్ప నటిగా మారింది..అదే తరుణంలో ఆమె ఎలా పతనం అయ్యింది అన్న విషయాన్ని చూపించారు.  తెలుగు, తమిళంలో ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడమే కాదు మంచి వసూళ్లు కూడా చేసింది.  ఈ మూవీ తర్వాత కీర్తి సురేష్ కి తెలుగు, తమిళంలో వరుస ఛాన్సులు వచ్చాయి. ఢిల్లీలో 66వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి సంబంధించిన బిగ్ షాట్స్ పాల్గొన్నారు. 

 

సోమవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు స్టార్స్ అవార్డులను అందుకున్నారు.  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వివిధ కేటగిరీలలో ఎంపికైన వారికి అవార్డులను ప్రదానం చేశారు. మహానటి మూవీకి గాను ఉత్తమ నటిగా కీర్తిసురేశ్‌ అవార్డు అందుకున్నారు.  ఇక చి.ల.సౌ మూవీకి ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే అవార్డును రాహుల్‌ రవీంద్రన్‌ అందుకున్నారు.  కీర్తితోపాటు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి, విక్కీ కౌషల్ లు పలు కేటగిరీలల్లో అవార్డులను అందుకున్నారు. 

 

ఇక, బాలీవుడ్ మెగా స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అమితాబ్ తరఫున దాదా సాహెబ్ పాల్కే అవార్డును ఆయన మనవుడు చంద్రశేఖర్ తీసుకున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: