కోలీవుడ్, టాలీవుడ్ లో డాన్స్ లోనే లాదు డైరెక్టర్ గాను తనకంటు ఒక ప్రత్యేకమైన స్టార్ డం ని సొంతం చేసుకున్నారు రాఘవ లారెన్స్ మాస్టార్. ఆయన సాంగ్స్ అంటే మాస్ ఆడియన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అంతేకాదు లారెన్స్ మాస్టర్ మెగాస్టార్ కోసం సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నాడంటే ఇక మెగా ఫ్యాన్సే కాదు ప్రేక్షకులందరికి పూనకాలే. ముఖ్యంగా లారెన్స్ మాస్టర్ డాన్స్ లో తనకమటు ఒక ప్రత్యేకమైన సిగ్నేచర్ ని క్రియోట్ చేసుకున్నారు. ఇక ఆయన మునీ ఫ్రాంచైజీ లో కాంచన సిరీస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఈ సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే రాఘవ లారెన్స్ హర్టయ్యారా? ఉన్నట్టుండి ఏమైంది? ఆయన ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? .. ప్రస్తుతం అభిమానుల్లో ఉన్న పెద్ద సందేహం. 

 

అసలింతకీ లారెన్స్ తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి? అంటే.. ఇకపై ఏ పబ్లిక్ ఫంక్షన్ కి తాను అతిధిగా హాజరు కాబోనని లారెన్స్ సడెన్ డెసిషన్ తీసుకోవడం సంచలనమైంది. రజనీకాంత్ సర్ సినిమా కార్యక్రమాల కు తప్ప ఇక ఏ వేడుకకు ఎటెండ్ కాను. అది కూడా రజనీ సర్ అనుమతి తీసుకున్నాకే ఆ కార్యక్రమానికి వస్తాను. వేరొక పబ్లిక్ ఈవెంట్ కి రాలేను. ఈ నిర్ణయాని కి రకరకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ మీతో చెప్ప లేను. నాకు రజనీ దీవెనల కంటే ఇంకేదీ ముఖ్యం కాదు అంటూ సామాజిక మాధ్యమాల్లో బాగా ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేయడం తో ఫ్యాన్స్ లో రకరకాల సందిగ్ధతలకు కారణమైంది.


 
ఇటీవల దర్బార్ ఈవెంట్లో మాట్లాడుతూ రజనీ కాంత్ అభిమాని ని అవ్వడం వల్ల కమల్ హాసన్ సినిమా పోస్టర్ల పై పేడ చల్లానని.. అదంతా అభిమానం తో అపరిపక్వం గా చేసిన పని అని ఒప్పుకున్నారు లారెన్స్. అయితే ఆ తర్వత కమల్ హాసన్ డైహార్డ్ ఫ్యాన్స్ సీరియస్ అవ్వడమే గాక లారెన్స్ పై సోషల్ మీడియా లో వ్యతిరేక ప్రచారం సాగించారు. ట్రోల్స్ తో విరుచుకు పడ్డారు. ఆ క్రమంలోనే కమల్ హాసన్ ని కలిసి మరీ లారెన్స్ సారీ చెప్పారు. తాను ఏ పరిస్థితి లో అలా చేయాల్సి వచ్చింది..! ఆ తర్వాత కమల్ హాసన్ అభిమానుల కు లారెన్స్ వివరణ ఇచ్చారు. ఇప్పటికీ కమల్ ఫ్యాన్స్ సీరియస్ గా ఉండడం తో మరోసారి ఇలాంటి కఠిన నిర్ణయాన్ని ప్రకటించారు లారెన్స్. ఇక ప్రస్తుతం లారెన్స్ మాస్టర్ తను తీసిన కాంచన సినిమాని బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మీ బాంబ్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: