అయ్యో, అయ్యో, అయ్యాయో..!! మన విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా అక్కడ ఘన స్వాగతం లభిస్తుందే. దానికి ఏమై ఉంటుంది కారణం? అందగాడనా? లేక ఆకర్షణీయమైన అతని వ్యక్తిత్వం వలన? చెప్పాలంటే... అన్నీ ఉన్నాయి మనోడిలో. అతంటి ఆలియా భట్టే మనోడిపైన మనసు పారేసుకుందంటే విజయ్ కి బానే సుడి ఉందని తెలుస్తుంది.

అసలు విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ తమిళ 'విజయ్' టీవీ నిర్వహించిన బిహైండ్ వుడ్స్  గోల్డ్ మెడల్స్ 2019 అనే క్రార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే, ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రియాంక దేశపాండే భాద్యతలు నిర్వహించింది. అయితే విజయ్ దేవరకొండ స్టేజి మీదకి రాగానే ప్రియాంక మాట్లాడుతూ, విజయ్ సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది. దాంతో, మన విజయ్ ఆమెని అభిమానంతో గట్టిగ హత్తుకున్నాడు. అయితే ఈ ఫోటోని ప్రియాంక తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసుకొని తెగ సంబరపడిపోతుంది. ఎంతైనా తనకి ఇష్టమైన హీరో హాగ్ ఇస్తే ఆ ఆనందమే వేరు అని ప్రియాంక ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.


ఇకపోతే, మన విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని మినహాయించి ఇంకొక ప్రాజెక్ట్ కి ఒప్పుకున్నాడు. దాంతో అతని సినీ జీవితంలో 12వ సినిమా అవుతుంది. ఈ 12వ సినిమా దిల్ రాజు నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనుంది. నాని నిన్నుకోరి చిత్రానికి దర్శకత్వం వహించింది శివ నిర్వాణ. అలాగే మజిలీ ని కూడా తెరకెక్కించాడు ఈయన. రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. శివ నిర్వాణ విజయ్ కోసం కూడా మంచి సినిమానే రెడీ చేశాడని సినీ వర్గాల నుంచి టాక్. నలుగురు హీరోయిన్స్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా అంటే ఫిబ్రవరి 14న రిలీజ్ అవ్వనున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: