వివాదాలకు చిరునామాగా మారిన రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలతో బిజీగా ఉంటాడు. అటు దర్శకుడిగానూ, నిర్మాతగానూ సినిమాల మీద సినిమాలు చేస్తుంటాడు. ఆయన నిర్మాణ నుండి వచ్చినన్ని సినిమాలు మరే నిర్మాణం నుండి రావేమో! ఒక సినిమా అయిపోయిందనుకునే లోపే మరో దానితో రెడీగా ఉంటాడు. మొన్నటికి మొన్న అత్యంత వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన "అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు" చిత్రం రిలీజైంది.

 

 

 

సినిమా రిలీజై ఇంకా థియేటర్లలో ఉండగానే మరో చిత్రం బ్యూటిఫుల్ అంటూ మన ముందుకు వసున్నాడు. ఈ సినిమా వర్మ పర్యవేక్షణలో జరిగిందట. ఈ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్ పోస్టర్ తో పాటు, ట్రైలర్ మరియు పాట కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఐటీసీ కోహీనూర్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమాని రంగీలాకి ట్రిబ్యూట్ గా వర్మ చెప్పుకుంటున్నాడు.

 

 

 తనకు బాలీవుడ్ లో అత్యంత పేరుతెచ్చిపెట్టిన రంగీలా చిత్రానికి అంకితమంటూ చెప్పుకుంటున్న వర్మ ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించారు. జనవరి ఒకటవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 2020 నూతన సంవత్సరం వర్మ సినిమాతోనే మొదలవుతుంది. ఇప్పటి వరకు మరే సినిమా ఆ తేదీని విడుదల తేదీగా ప్రకటించలేదు. కాబట్టి ఈ సినిమాకి బాక్సాఫీసు వద్ద కూడా పోటీ ఉండదు.

 

 

 

మరి ఇవన్నీ కలిసొచ్చి వర్మ సినిమా విజయాన్ని అందుకుంటుందా లేదా చూడాలి. దర్శకుడు అగస్త్య మంజు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ట్. శ్రీధర్ మరియు టి నరేష్ కుమార్ నిర్మిస్తున్నారు. పార్థు సూరి, నైనా గంగూలీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రవిశంకర్ అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: