నిజజీవితంలో మామాఅల్లుళ్లు అయిన నాగచైతన్య, వెంకటేష్ అవే పాత్రల్లో నటించిన సినిమా వెంకీమామ. పవర్ సినిమా ఫేమ్ బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. మొదటి మూడు రోజులు కలెక్షన్లు బాగానే వచ్చినా నాలుగో రోజు నుండే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమాను దాదాపు 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారని సమాచారం. 
 
వెంకీమామ థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇప్పటివరకు 27 కోట్ల రూపాయల వరకు రికవరీ అయినట్లు సమాచారం. వెంకీమామ సినిమాకు నైజాంలో 9.51 కోట్ల రూపాయలు, సీడెడ్ ఏరియాలో 4 కోట్ల రూపాయలు, ఉభయగోదావరి జిల్లాల్లో 3 కోట్ల 10 లక్షలు, ఉత్తరాంధ్రలో 3కోట్ల 60 లక్షలు, కృష్ణా జిల్లాలో కోటీ 50 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటీ 90 లక్షలు, నెల్లూరు జిల్లాలో 85 లక్షలు వచ్చాయి.
 
ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో 24.50 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన వెంకీమామ కర్ణాటక, ఇతర ఏరియాల్లో 2.50 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ మొత్తాలకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఈ వారం రోజుల కలెక్షన్లతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయ్యే అవకాశం ఉంది. రూలర్, ప్రతిరోజూ పండగే సినిమాలు విడుదలైనా వెంకీమామ కొన్ని ఏరియాలలో స్టడీ కలెక్షన్లను రాబట్టటం గమనార్హం. 
 
డైరెక్టర్ బాబీ కథ, కథనం విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే మాత్రం సినిమా సూపర్ హిట్ గా నిలిచేది. కానీ కథ, కథనాల్లో లోపాల వలన యావరేజ్ దగ్గరే ఈ సినిమా ఫలితం ఆగిపోయింది. సంక్రాంతి పండుగ వరకు పెద్ద సినిమాలు లేవు కాబట్టి వెంకీమామ అప్పటివరకు మేజర్ ఏరియాలలో కలెక్షన్లను రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వెంకీమామ ఓవరాల్ గా నిర్మాత సురేష్ బాబు అటు లాభాలను, ఇటు నష్టాలను ఇవ్వకుండా పెట్టిన పెట్టుబడిని మాత్రమే వెనక్కు తీసుకొనిరావడం గమనార్హం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: